జాతీయ వార్తలు

హజ్ యాత్రికులకు సకాలంలో వ్యాక్సిన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: హజ్ యాత్రికులకు వ్యాక్సిన్లు వేయడానికి అవసరమయిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. దేశంలో మెనింజైటిస్ వ్యాక్సిన్ల కొరత ఉన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆరోగ్య మంత్రి చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో కేవలం ఒకే ఔషధ కంపెనీ ఇప్పటి వరకు ఈ వాక్సిన్లను తయారు చేసింది. అయితే, ఈ కంపెనీ తయారు చేసిన ఓరల్ పోలియో వ్యాక్సిన్లు కల్తీగా ఉన్నట్టు తేలడంతో మానవ వ్యాక్సిన్ల తయారీని నిలిపివేయాల్సిందిగా ఆ కంపెనీని ప్రభుత్వం గత సంవత్సరం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రి నడ్డా మెనింజైటిస్ వ్యాక్సిన్లు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయనే అంశంపై ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులతో సోమవారం సమీక్షించారు. ‘హజ్ యాత్రికులకు వ్యాక్సిన్లు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను’ అని మంత్రి నడ్డా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. ఇప్పుడు హజ్ యాత్రికులకు సకాలంలో వ్యాక్సిన్లు వేయడానికి గాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతోందని ఆ వర్గాలు వివరించాయి.