జాతీయ వార్తలు

ఐదేళ్ళలో నక్సలిజం అంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్సేనాబాద్ (జార్ఖండ్), ఏప్రిల్ 23: దేశంలో 2023 సంవత్సరం నాటికి నక్సల్స్‌ను నామరూపాలు లేకుండా అంతమొందిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశ భద్రతకు, అభివృద్ధికి ఉగ్రవాదులు ప్రతిబంధకాలు అయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాలవౌ (ఎస్‌సి) లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి వీడీ రామ్ తరఫున ఆయన మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్ధేశించి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ నక్సల్స్‌ను ఏరివేయాల్సి ఉందన్నారు. జార్ఖండ్‌లో దాదాపుగా నక్సల్స్‌ను అంతమొందించడం జరిగిందని, త్వరలో పూర్తిగా అణచి వేస్తామని ఆయన తెలిపారు. అధికారం కోసం జార్కండ్ ముక్తీ మోర్చా, కాంగ్రెస్ చేతులు కలిపాయని, అయితే వారి ఆశయం నెరవేరదని, ఓటమి చవి చూస్తారని ఆయన చెప్పారు. ఎన్నికల మ్యాచ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి సమఉజ్జీ ఎవరూ లేరని ఆయన తెలిపారు. శక్తివంతుడైన మోదీ ముందు అంతా మరుగుజ్జులేనని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఉజ్వల, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, జన్‌ధన్ యోజన వంటి ఎనె్నన్నో పథకాలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. 2022 సంవత్సరం నాటికి ఎన్నికల ప్రణాళికల్లో పేర్కొన్న వాటిని పూర్తిగా అమలు చేస్తామని ఆయన తెలిపారు.
బాల్‌కోట్‌లో విమాన దాడులు చేశామంటున్న ప్రభుత్వం దానికి శవాల ఆధారాలు చూపించాలని ప్రతిపక్షాలు ప్రశ్నించడాన్ని ఆయన ఎగతాళి చేశారు. భారత వైమానికి దళాల లక్ష్యం శతృ దేశం ఉగ్ర స్థావరాలపై దాడి చేసి అంతమొందించడమే తప్ప, శవాలను లెక్కించడం కాదన్నారు. పుల్వామా దాడి అనంతరం ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు సంఘీభావం ప్రకటించాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.