జాతీయ వార్తలు

అడిగింది చెప్పరు.. చెప్పింది చేయరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుంగార్‌పూర్, ఏప్రిల్ 23: యావత్ దేశాన్ని తప్పుదారి పట్టించిన ప్రధానిగా నరేంద్రమోదీ పేరు చరిత్రలో లిఖించబడుతుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎద్దేవా చేశారు. గిరిజనులు ఎక్కువగా ఉండే బెనేశ్వర్‌ధామ్ వద్ద మంగళవారం ఎన్నికల ప్రచార సభలో గెహ్లాట్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ ఆయన గోవులు, రామమందిరం, దేశ భక్తిగురించి మాట్లాడతారు. నిత్యం ప్రజలను తప్పుదారి పట్టించడడానికే ఆయన ప్రయత్నాలన్నీ’అని మోదీపై విరుచుకుపడ్డారు. ఈ విషయంలో మోదీ పేరు చరిత్రలో నిలిచిపోతుందని గెహ్లాట్ వ్యంగ్యోక్తులు విసిరారు. దళితులు, యువత, మైనారిటీలు, బలహీన వర్గాల పథకాలపై చర్చకు రమ్మని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనేక సార్లు ఆహ్వానించినా మోదీ స్పందించిన దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని పట్టించుకోలేదన్న బీజేపీ నేతల విమర్శలపై రాజస్థాన్ సీఎం ఘాటుగానే స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తుంది. దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ముందుకు తీసుకెళ్లిన ఘనత మాదే. కాంగ్రెస్ హయాంలో దేశం ఎన్నో మైలురాళ్లను అధిగమించింది’అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో శాంతిని పాదుగొల్పింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఉద్ఘాటించారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ మాట్లాడుతూ దేశానికి మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. పేదలు, రైతులు, యువత, మహిళలు అనేక కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధిపై చర్చకు ఆహ్వానిస్తే బీజేపీ తప్పించుకుపోయిందని ఉప ముఖ్యమంత్రి పైలట్ ఎద్దేవా చేశారు. మోదీని ఎవరైనా అభివృద్ధి గురించి అడిగితే హిందూస్తాన్-పాకిస్తాన్, హిందూ- ముస్లిం అంటూ మొదలెడతారని ఆయన ధ్వజమెత్తారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మోదీ రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తారని సచిన్ పైలట్ విరుచుకుపడ్డారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఎరువులు, విత్తనాల కొరత వంటి సమస్యలకు మోదీ వద్ద సమాధానం లేదని, ఎంతసేపూ ఏదోఒకటి చెప్పి జనాన్ని తప్పుదారిపట్టించేందుకే ప్రయత్నిస్తారని ఆయన అన్నారు. సమాజంలో పేదలు, గిరిజనులు, బలహీన వర్గాల కోసం పాటుపడేది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు.