జాతీయ వార్తలు

బీజేపీ కోసమే సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరంబాగ్/ఖానాకుల్ (పశ్చిమ బెంగాల్), ఏప్రిల్ 23: కేంద్రంలోని అధికార బీజేపీ విజయానికి తోడ్పడేందుకే లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను మూడు నెలల పాటు కొనసాగిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో మోహరించిన కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నాయని, పోలింగ్ కేంద్రాల్లో తిష్టవేసి కాషాయ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నాయని ఆమె అన్నారు. మాల్దహా, బాలూరుఘాట్ నియోజకవర్గాల్లో మంగళవారం జరిగిన పోలింగ్‌లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఓటర్లను కేంద్ర బలగాలు కోరినట్లుగా తనకు సమాచారం అందిందన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళామని ఆమె తెలిపారు. ఈ ప్రాంతాల్లోని 166, 167 పోలింగ్ కేంద్రాల్లో ఈ రకమైన పరిస్థితి నెలకొందని ఆమె అన్నారు. కేంద్ర బలగాలకు పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించే హక్కు లేదని, అది వారి పని కాదని మమత తెలిపారు. కొన్ని చోట్ల బారులు తీరిన ఓటర్లను సైతం బీజేపీకి ఓటు వేయాలని ఈ బలగాలు కోరినట్లుగా తెలుస్తున్నదన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, అలాంటి ప్రభుత్వ నేతల ఆదేశాలు పాటించరాదని ఆమె కేంద్ర బలగాలను కోరారు. ఇప్పుడు బీజేపీ తరఫున పని చేసిన అనంతరం కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం మాటే వినాల్సి వస్తుందని ఆమె కేంద్ర బలగాలకు స్పష్టం చేశారు. ఇక ఎంత మాత్రం మోదీ ప్రధానిగా కొనసాగే అవకాశం లేదని మంగళవారం ఇక్కడ జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై కూడా మమత విరుచుకుపడ్డారు. ఈ ఐదేళ్ళ కాలంలో రిజర్వ్ బ్యాంక్, సీబీఐ వంటి ఎన్నో రాజ్యాంగ సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేసిందని ఆమె ఆరోపించారు.