జాతీయ వార్తలు

డీజిల్ వాహనాలను తొలగించడంపై కార్యాచరణ ఏదీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: డీజిలు వాహనాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆందోళన వ్యక్తం చేసింది. డీజీలు వాహనాలను దశల వారీగా తొలగించడంపై తమకు కార్యాచరణ ప్రణాళికను అందజేయాలని ఎన్‌జీటి తుగ్లకాబాద్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపొ (టీకె/ఐసీడీ) అధికారులను ఆదేశించింది. ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్ తాజాగా ఈ కేసును విచారించారు. కార్యాచరణ ప్రణాళిక నివేదిక అందజేసేందుకు తమకు మరి కొంత వ్యవధి కావాలని కోరడంతో, జూలై 31వ తేదీ వరకు ఎన్‌జీటీ గడువునిచ్చింది. ఆగస్టు 9న కేసును విచారిస్తామని ఎన్‌జీటీ స్పష్టం చేసింది. తుగ్లకాబాద్ ఐసీడీ వాయుకాలుష్యాన్ని వెదజల్లుతున్నదన్న పిటీషన్‌పై ఎన్‌జీటీ (ట్రిబ్యునల్) ఈ ఏడాది మార్చి 8న ఆరు నెలల్లోగా డీజీలు వాహనాలను తొలగించాలని ఆదేశించింది. దీనిపై నెల రోజుల్లోగా నివేదిక అందజేయాలని కూడా ఆదేశించింది. డీజీలు వాహనాలను నిలిపి వేసి, ఎలక్ట్రానిక్, హైబ్రిడ్, సీఎన్‌జీకి బదిలీ కావాలని సూచించింది. ఐసీడీ ప్రతి ఏడాది 3 లక్షల కంటైనర్లను వినియోగిస్తున్నదని, దీంతో వాయుకాలుష్యం, శబ్ధ కాలుష్యంతో పాటు వాహనాల నిలుపుదల (పార్కింగ్)కు సమస్య తలెత్తుతున్నదని ఎన్‌జీటీ పేర్కొంది. డీజీలు వాహనాలను దశల వారీగా తొలగించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ఐసీడీ వద్ద లేదని గ్రీన్ ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా డీజీలు వాహనాలు తొలగించాలన్న బాధ్యత లేదా? అని బెంచ్ ప్రశ్నించింది. వేర్ హౌసింగ్ నిపుణుడు అజయ్ ఖేరా తరఫున న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఎన్‌జీటీ విచారణ చేపట్టింది. ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుందని పిటీషనర్ తెలిపారు. దేశ రాజధానికి ఐసీడీని మార్చాలని ఎన్‌జీటీని కోరారు.