జాతీయ వార్తలు

జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: తెలంగాణ ఇంటర్ బోర్డులో అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట తెలుగు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఐఐటి ఢిల్లీ విద్యార్థులు బుధవారం తెలంగాణ భవన్ ముందు నిరసన తెలిపారు. ఇంటర్ బోర్డు తప్పిదాలపై న్యాయ విచారణ జరిపించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.