జాతీయ వార్తలు

సస్పెన్స్‌కు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తలపడటం లేదు. ప్రియాంకను వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీకి దించకూడదని రాహుల్ గాంధీ గత రాత్రి నిర్ణయించినట్లు తెలిసింది. దీనితో కాంగ్రెస్ తరపున పాత అభ్యర్థి అజయ్ రాయ్ మరోసారి నరేంద్ర మోదీపై పోటీ చేయనున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా అజయ్ రాయ్ కాంగ్రెస్ తరపున మోదీతో పోటీపడి భారీ ఓట్ల తేడాతో ఓడిపోయి మూడో స్థానానికి పరిమితం కావటం తెలిసిందే. నరేంద్ర మోదీతో తలపడిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా భారీ మెజారిటీతో ఓడిపోయారు. నరేంద్ర మోదీ దాదాపు మూడున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కి మొత్తం ఓట్లలో కేవలం ఏడు శాతం మాత్రమే లభించగా, కేజ్రీవాల్‌కు ఇరవై శాతం ఓట్లు పడ్డాయి.
ప్రియాంక పోటీ నుంచి తప్పుకుని అజయ్ రాయ్‌ని నిలబెట్టడం, ఇతర పార్టీల నుండి సీనియర్ నాయకులెవ్వరూ రంగంలో లేకపోవటంతో నరేంద్ర మోదీ ఈసారి ఐదారు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోదీపై ప్రియాంకను పోటీకి దించటంపై కాంగ్రెస్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. నరేంద్ర మోదీ చేతిలో ప్రియాంకా గాంధీ ఓడిపోయే పక్షంలో కాంగ్రెస్‌కు రాజకీయంగా ఊహించనంత నష్టం కలగటంతోపాటు దీని ప్రభావం రాహుల్ గాంధీపై కూడా పడుతుందని పలువురు సీనియర్ నాయకులు స్పష్టమైన హెచ్చరిక చేసినట్లు తెలిసింది. పార్టీ సీనియర్ నాయకులు చాలాకాలం క్రిందటే ప్రియాంక వారణాసి నుంచి పోటీచేసే ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ అమేథీలో విజయం సాధించటం కష్టమైనందుకే ముందు జాగ్రత్త చర్య కింద కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నప్పుడు వారణాసిలో నరేంద్ర మోదీపై ప్రియాంకా గాంధీని పోటీకి పెట్టడం పూర్తి అనాలోచిత
చర్య అవుతుందని పలువురు సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. అయినా ఆమెను వారణాసి నుంచి పోటీ చేయించాలని రాహుల్ గాంధీ కొంతకాలం ఆలోచించినా ఆ తరువాత ఉత్తరప్రదేశ్‌లో మారిన రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తన నిర్ణయం మార్చుకున్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. వారణాసిలో నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని, అయితే తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీసుకోవలసి ఉంటుందని ప్రియాంక ఇంతకాలం చెబుతూ వచ్చారు. రాహుల్ గాంధీ పోటీ చేయమంటే మోదీపై సంతోషంగా పోటీ చేస్తానని ఆమె బుధవారం కూడా ప్రకటించారు.
అయితే కాంగ్రెస్ అజయ్ రాయ్‌కు వారణాసి టికెట్ కేటాయించటతో ప్రియాం ప్రధాన మంత్రితో తలపడుతుందా లేదా అనే చర్చకు తెరపడింది. ఇదిలా ఉండగా అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ షాలినీ యాదవ్‌ను నరేంద్ర మోదీపై పోటీకి దించింది. షాలినీ యాదవ్ గత సోమవారం సమాజ్‌వాదీ పార్టీలో చేరటం గమనార్హం.