జాతీయ వార్తలు

బుందేల్‌ఖండ్‌లో జోరు ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝాన్సీ, ఏప్రిల్ 25: ప్రజల మనసులను తెలుసుకొని వారి ఇబ్బందులను తీర్చే నాయకులనే ఎన్నుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇక్కడ జరిగిన రోడ్ షోలో పిలుపునిచ్చారు. రెండు రోజుల్లో ప్రియాంక ఈ ప్రాంతంలో పర్యటించడం ఇది రెండోసారి. ఈ నెల 29న జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోనే మూడు సీట్లు ఉన్నాయి. ఝాన్సీలో రోడ్ షో నిర్వహించిన ప్రియాంకకు దారిపొడవునా ప్రజలు నీరజనాలు పలికారు. వారితో ముచ్చటిస్తూ ఛలోక్తులు విసురుతూ ఆహ్లాదంగా ప్రియాంక ఈ రోడ్‌షో నిర్వహించారు. తనపై పువ్వులు విసురుతూ స్వాగతం పలికిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రియాంక ‘మోదీ ప్రభుత్వం ప్రజలు, రైతులు, మహిళలను విస్మరిస్తుంది. ఎలాగైనా అధికారంలోకి రావడం బీజేపీ ఆశయంగా కనిపిస్తోంది’ అని అన్నారు. దారిపొడవునా ‘చౌకీదార్ చోర్ హై’ అనే నినాదాలు మారుమోగాయి. బుధవారం కూడా ఇదే ప్రాంతంలో పర్యటించిన ప్రియాంక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని ప్రియాంక అన్నారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని సీట్లపై అన్ని పార్టీలు తమ దృష్టిని కేంద్రీకరించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఏడు జిల్లాలతో కూడిన బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే బీఎస్పీ నాయకురాలు మాయావతి హామీ ఇచ్చారు. అంతేకాదు, మధ్యప్రదేశ్‌లోని ఆరు జిల్లాలను కూడా బుందేల్‌ఖండ్‌లో కలపాలన్న డిమాండ్‌లు వెల్లువెత్తాయి. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని 2014 ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా అప్పట్లో ఈ తరహా హామీని ఇచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని నాలుగు స్థానాలు బీజేపీకే దక్కాయి. 44.86 శాతం ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలుపొందింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ రెండు రోజుల ర్యాలీలను మంచి ప్రతిస్పందన వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీని ప్రజలు ఏ మేరకు చేయూత నిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
చిత్రం...ఝాన్సీలో గురువారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఓటర్లకు అభివాదం చేస్తున్న ప్రియాంక