జాతీయ వార్తలు

పేదలకు తీవ్ర అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాలొర్, ఏప్రిల్ 25: గత ఐదేళ్ల పాలనలో ప్రధాని మోదీ పేదలకు తీవ్ర అన్యాయం చేశారని, దీంతో ‘మంచి రోజులు వస్తాయి’ అనే నినాదం కాస్తా ఇప్పుడు ‘కాపలాదారుడే దొంగ’గా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. రాజస్థాన్‌లోని మర్వార్ రీజియన్‌లోని జాలొర్‌లో ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు న్యాయం చేయగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, అందుకే బీజేపీని గద్దెనెక్కించాలని పిలుపునిచ్చారు. రుణాలు తీసుకుని చెల్లించని ధనవంతులను జైలుకు పంపనప్పుడు రైతులను కూడా అరెస్టు చేయరాదని ఆయన అన్నారు. గొప్పవారికి లక్షల కోట్లను ఇస్తే పేదలు, రైతులు, గిరిజనులు, వ్యాపారులు, దళితులకు సైతం ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని పౌరులను రెండు విభాగాలుగా విభజించరాదని, దేశంలోని ఏ పౌరుడికి అన్యాయం జరగరాదన్నారు. మోదీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా వర్తకులు, పేదలు, కర్షకులను దోచుకున్నారని ఆరోపించారు. సమాజంలో అన్యాయానికి గురైన పేదలను ఆదుకునేందుకు తాము ‘న్యాయ్’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు రాహుల్‌గాంధీ తెలిపారు. ఐదేళ్ల క్రితం ‘మంచిరోజులు వస్తాయి’ అన్న నినాదం ప్రచారంలోకి వచ్చిందని, కాని ఇప్పుడు దాని స్థానంలో ‘కాపలాదారుడే దొంగ’ నినాదం ఎక్కడకు వెళ్లినా విన్పిస్తోందని పేర్కొన్నారు. తమ పార్టీ దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, మేధావులను సంప్రదించి నెలకు ఆరువేల రూపాయల చొప్పున సంవత్సరానికి 72 వేల రూపాయలను పేదల ఖాతాల్లో వేసే ‘న్యాయ్’ పథకానికి రూపకల్పన చేసిందని రాహుల్‌గాంధీ తెలిపారు. దీని ద్వారా 25 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మోదీ హయాంలో పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన ఇప్పుడు ఆ ఖాతాల్లోనే తాము పేదలకు ఈ మొత్తాన్ని వేస్తామని తెలిపారు.
కుటుంబంలోని మహిళ ఖాతాలో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేస్తామని ఆయన చెప్పారు. ఈ పథకం దేశంలోని ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపుఇస్తుందని, అంతేకాకుండా యువతకు ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. అలాగే తాము అధికారంలోకి వస్తే సంవత్సర కాలంలో 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని, రైతులకు ప్రత్యేక బడ్జెట్, మహిళలకు అసెంబ్లీ, పార్లమెంట్‌లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన తెలిపారు. దేశంలోని కేవలం 15 మంది ధనవంతుల కోసమే మోదీ పనిచేస్తున్నారని, పేదలు చెమటోడ్చి పైసాపైసా కూడబెడితే ఆ మొత్తాన్ని ఆయన వారికి ధారపోసారని రాహుల్‌గాంధీ విమర్శించారు.

చిత్రం...అజ్మీర్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో కరచాలనం చేస్తున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు