జాతీయ వార్తలు

వారి చేతుల్లో దేశ భద్రత గాలికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘాజిపూర్ (యూపీ), ఏప్రిల్ 25: విపక్ష నేతల చేతుల్లో దేశం ఎంతమాత్రం భద్రంగా ఉండదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. యూపీలోని ఘజియాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఇటీవల బాలాకోట్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై మన భద్రతా దళాలు జరిపిన దాడులను అవమానపర్చేలా ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు మాట్లాడారని అన్నారు. ఇలాంటి మహాకూటమి పార్టీలు దేశం గురించి మాట్లాడుతుంటాయని, ఇలాంటి వారు దేశాన్ని ఎంతమాత్రం భద్రంగా ఉంచలేరని, దేశభద్రత గాలిలోనే ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదులతో బీజేపీ ఎన్నడూ ఐఎల్‌యు (ఐలవ్యూ) ప్రేమలు కురిపించదని స్పష్టం చేసిన ఆయన బాలాకోట్ దాడుల తర్వాత రాహుల్, మాయావతి, అఖిలేష్ ముఖాల్లో అంత విచారం ఎందుకు కన్పించిందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. చనిపోయిన ఉగ్రవాదులు వారి తల్లి తరఫున కాని తండ్రి తరఫున కాని బంధువులా? అని ఆయన ప్రశ్నించారు. దేశ రక్షణ విషయంలో బీజేపీ ఎన్నడూ రాజీ పడదని, వారు (పాకిస్తాన్) ఒక బుల్లెట్ పేలిస్తే ఇక్కడి (్భరత్) నుంచి బాంబు వేస్తాం.. వారు ఇటుకలు వేస్తే మేము బండరాళ్లు కుమ్మరిస్తాం అని ఆయన సమాధానం చెప్పారు. చిన్న చిన్న గ్యాంగ్‌లతో దేశాన్ని ముక్యలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన ఆరోపించారు. తాము కనుక అధికారంలోకి వస్తే విద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడాన్ని తప్పుబట్టిన ఆయన ఇది దేశద్రోహులను ప్రోత్సహించడమేనని ఆరోపించారు. కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ మనోజ్ సిన్హాను ఘాజిపూర్ నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.