జాతీయ వార్తలు

ఐఏఎఫ్‌కు సాంకేతిక దన్ను ఉండి ఉంటే పాక్‌కు భారీ నష్టం వాటిల్లి ఉండేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారత వాయుసేన (ఐఏఎఫ్) సాంకేతికంగా అన్ని రకాలుగా వెసులుబాట్లు కలిగి ఉండి ఉంటే, పాకిస్తాన్ ఫిబ్రవరి 27వ తేదీన భారత్‌పై వైమానిక దాడికి విఫలయత్నం చేసిన సందర్భంగా ఆ దేశానికి తీవ్రమయిన నష్టం వాటిల్లి ఉండేదని ఐఏఎఫ్ నివేదిక ఒకటి వెల్లడించింది. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో గల జైష్ ఎ మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద శిబిరంపై ఐఏఎఫ్ ఫిబ్రవరి 26న జరిపిన వైమానిక దాడి, మరుసటి రోజు పాకిస్తాన్ జరిపిన ప్రతీకార దాడిలోని వివిధ కోణాలను ఈ నివేదిక విశే్లషించింది. పుల్వామాలో జేఈఎం ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌పై వైమానిక దాడికి దిగింది. పాకిస్తాన్ 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పటి నుంచి తన గగనతల రక్షణ, దాడి సామర్థ్యాలను పెంచుకుంటూ వస్తోందని నివేదిక విశే్లషించింది.
భారత్ గగనతల యుద్ధం కోసం సాంకేతికపరమయిన వెసులుబాట్లను పెంచుకోవలసిన అవసరం ఉందని ఈ నివేదికను ఉటంకిస్తూ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఏఎంఆర్‌ఏఏఎం క్షిపణులు అమర్చిన ఎఫ్-16 యుద్ధ విమానాలను కలిగి ఉండటం వల్ల మనకన్నా కాస్త మెరుగ్గా ఉందని ఒక అధికారి వివరించారు. భారత్ వద్ద ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే పాకిస్తాన్ వాయుసేన కన్నా ఐఏఎఫ్ గణనీయమయిన ముందంజలో ఉండేదని ఆయన పేర్కొన్నారు. ‘శత్రువును తగిన విధంగా శిక్షించలేకపోయామని మేము భావించాం. అందువల్ల సాంకేతికపరంగా అన్ని రకాల వెసులుబాట్లను పెంచుకోవలసిన అవసరం ఉందని భావించాం. అప్పుడు శత్రువు మన సరిహద్దు సమీపానికి రావడానికి కూడా సాహసించడు’ అని ఆ అధికారి పేర్కొన్నారు.