జాతీయ వార్తలు

‘నమో, నమో’ కీర్తనలకు ఈ ఎన్నికలతో ముగింపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నౌజ్, ఏప్రిల్ 25: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి గురువారం బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈ లోక్‌సభ ఎన్నికలు ‘నమో, నమో’ అని కీర్తిస్తున్న వారికి ముగింపు పలుకుతాయని ఆమె అన్నారు. మాయావతి ఎస్‌పీ-బీఎస్‌పీ సంయుక్తంగా నిర్వహించిన ఒక ఎన్నికల సభలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆయన భార్య, సిట్టింగ్ ఎంపీ డింపుల్ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. డింపుల్ యాదవ్ ఎస్‌పీ-బీఎస్‌పీ కూటమి అభ్యర్థిగా ఇక్కడి నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ ‘ఈ ఎన్నికలు ‘నమో, నమో’ అని కీర్తిస్తున్న వారికి ముగింపు పలుకుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలేదని ఆమె గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు భారత రత్న బిరుదు ఇవ్వలేదని ఆమె విమర్శించారు.