జాతీయ వార్తలు

ఓ యువకుడిని కత్తితో పొడిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జబల్పూర్ (మధ్యప్రదేశ్), ఏప్రిల్ 25: మాలేగాంవ్ పేలుళ్ల కేసులో నిందితురాలు, భోపాల్ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ 2001లో ఒక వ్యక్తిని కత్తితో పొడిచారని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ తెలిపారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఠాకూర్ ప్రవర్తన ‘సాధ్వి’ (ఆధ్యాత్మికురాలయిన మహిళ)గా లేదని అన్నారు. ‘ప్రజ్ఞా ఠాకూర్‌కు మా చత్తీస్‌గఢ్‌తో సంబంధం ఉంది. ఆమె బావ బలోడబజార్ జిల్లాలోని బిలాయిగఢ్‌లో గల ఒక గోదాములో పనిచేశాడు’ అని బాఘెల్ వివరించారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను పోటీకి దింపడం ద్వారా బీజేపీ ‘హిందూత్వ కార్డు’ను ప్రయోగిస్తోందా? అని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ ఈ విషయం వెల్లడించారు. ‘ఆమె (ప్రజ్ఞాసింగ్) ఎప్పుడూ కత్తి పట్టుకొని తిరుగుతూ ఉండేవారు. బిలాయిగఢ్‌లో 2001లో శైలేంద్ర దేవగన్ అనే యువకుడి ఛాతిలో ఆమె కత్తితో పొడిచారు’ అని బాఘెల్ వివరించారు. ‘ప్రజ్ఞాసింగ్ కొట్లాటల్లో పాల్గొంటుండేవారు. మొదటి నుంచి ఆమె ప్రవర్తన అలవాటుపడిన నేరస్థురాలిగానే ఉంది. సాధ్విలాగా లేదు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మాలేగాంవ్ పేలుళ్ల కేసులో నిందితురాలయిన ప్రజ్ఞాసింగ్ ప్రస్తుతం బెయిలుపై బయటికి వచ్చారు. అయితే చత్తీస్‌గఢ్ సీఎం బాఘెల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి హితేశ్ బాజ్‌పాయి తోసిపుచ్చారు. సాధ్వికి వ్యితిరేకంగా చేసిన ప్రకటనపై బాఘెల్ క్షమాపణ చెప్పాలని, లేకుంటే పరువునష్టం దావాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.