జాతీయ వార్తలు

మంత్రుల కంటే మోదీ ఆదాయం తక్కువే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: తన మంత్రివర్గ సహచరులు చాలా మందికంటే ప్రధాని నరేంద్ర మోదీ పేదవాడేనని తాజాగా వెలువడిన ఓ కథనాన్ని బట్టి స్పష్టమవుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, అప్పుల వివరాలు మోదీ వెల్లడించారు. వాటి ప్రకారం ఆయనకు తాను రాసిన, తన గురించి రాసిన పుస్తకాల ద్వారా 12,35,000 ఆదాయం వస్తోంది. 2016 మార్చినాటికి ప్రధాని వద్ద 89,700 నగదు మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూస్తే తన మంత్రివర్గ సహచరులకంటే మోదీ ఆదాయం తన కేబినెట్ సహచరులకంటే కూడా తక్కువని అర్థమవుతోంది. అలాగే మోదీకి గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఓ బ్యాంకులో 2లక్షల 10వేల రూపాయలు నగదు గలిగిన ఎస్‌బి అకౌంట్ ఉంది. అదే బ్యాంకులో ఆయనకు 50 లక్షల రూపాయల ఎఫ్‌డి ఉంది. దీంతోపాటు లక్షా 27వేల విలువైన 4 బంగారు ఉంగరాలున్నాయి. వీటన్నింటినీ లెక్కగడితే ఆయన చరాస్తుల విలువ 73 లక్షల 36 వేలు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కోటి విలువైన అపార్ట్‌మెంట్ ఆయనకు ఉంది. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, సదానందగౌడ, మేనకాగాంధీ, వెంకయ్యనాయుడు తదితరులు ఆదాయ వివరాలు కూడా పిఎంవో వైబ్‌సైట్‌లో వెల్లడించారు.