జాతీయ వార్తలు

పాక్ ప్రధాని ఇమ్రాన్ నాకు స్నేహితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసన్‌సోల్ (పశ్చిమ బెంగాల్), ఏప్రిల్ 25: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో జాతీయవాదం, పాకిస్తాన్ అంశాలు చోటు చేసుకోవడంపై నటి, అసన్‌సోల్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి మూన్ మూన్ సేన్ చికాకు వ్యక్తం చేశారు. అవసరమయితే, తాను తన పాత ‘స్నేహితుడు’, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో మరోసారి మాట్లాడతానని అన్నారు. అయితే, సేన్ ద్వైపాక్షిక అంశాలపై ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడటానికి విముఖత వ్యక్తం చేశారు. దేశంలో ‘అనేకమంది కార్యదక్షులయిన రాజకీయ నాయకులు’ ఉన్నారని, తనకు ఎప్పుడూ ఆ బాధ్యత అప్పగించడం జరుగబోదని ఆమె ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాలలో భారత్ ప్రతిష్టను పెంచారని ప్రశంసిస్తూనే, ఆయన తన స్వంత దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకించి నిరుద్యోగ సమస్యను మరచిపోయారని విమర్శించారు.
‘ఇమ్రాన్ నాకు స్నేహితుడు. (పాకిస్తాన్ ప్రస్తావనతో జాతీయవాదంపై) ఒక రకమయిన విచ్ఛిన్నకర రాజకీయాలు కొనసాగుతుండటం మహా ప్రమాదకరం’ అని సేన్ అన్నారు. ఇరు దేశాల మధ్య విద్వేష వాతావరణం నెలకొన్న సమయంలో అవసరమయితే, మీరు మరోసారి ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడతారా? అని ప్రశ్నించగా, ‘ఎందుకు మాట్లాడను. ఆయన నాకు స్నేహితుడు’ అని ఆమె బదులిచ్చారు. 1980వ దశకం చివరలో, 1990వ దశకంలో ఇమ్రాన్ ఖాన్ క్రికెటర్‌గా ఉండి, పాకిస్తాన్ జట్టుకు సారథ్యం వహిస్తున్న రోజుల్లో సేన్ ఆయనకు మంచి స్నేహితురాలిగా భావిస్తుండేవారు. వారి స్నేహం వార్తాపత్రికలు, గాసిప్ మ్యాగజైన్‌లలో రెగ్యులర్‌గా వార్తల్లోకి ఎక్కుతూ ఉండేది.