జాతీయ వార్తలు

థానేలో 49 అడుగుల ఎత్తులో దహీహండీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 25: సుప్రీం కోర్టు మార్గదర్శకాలను తోసిరాజని మహారాష్ట్ర అంతటా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. మైనర్లు వేడుకల్లో పాల్గొనకూడదని, మానవ పిరమిడ్లు ఎత్తు 20 అడుగులు మించకూడదని సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ముంబయి సహా పలు పట్టణాల్లో ఎక్కడా కోర్టు నిబంధనలు పట్టించుకోలేదు. ఇరవై అడుగుల కంటే ఎక్కువ ఎత్తునలో మానవ పిరమిడ్లు ఏర్పాటు చేయవద్దని బుధవారం సుప్రీం ఆదేశించింది. అయితే థానేలో ఏకంగా 49 అడుగుల ఎత్తులో దహీహండీ ఏర్పాటు చేశారు. ఉట్టికొట్టే ఉత్సవం గురువారం ఉదయం అట్టహాసంగా ప్రారంభించారు. రాజ్‌థాకరే నాయకత్వంలోని ఎంఎన్‌ఎస్‌పార్టీ కార్యకర్త దీన్ని ఏర్పాటు చేశారు. దీనిపై రాజ్ మాట్లాడుతూ మహారాష్టల్రో పండుగల పరిరక్షణకు తాను ముందుంటానని, సుప్రీం ఆదేశినంత మాత్రన చట్టం అయిపోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. థానేలోనే కాదు సబర్బన్ దాదర్‌లోనూ కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ ఇరవై అడుగుల కంటే ఎత్తులోనే పిరమిడ్లు ఏర్పాటు చేశారు. మరొక ప్రాంతంలో ఏకంగా కోర్టు ఆదేశాలను నిరసిస్తూ నల్లజెండాలు ఎగరేశారు. ముంబయి, ఆ పరిసరాల్లో ఉట్టికొట్టేందుకు 3,300 మండపాలు ఏర్పాటయ్యాయి. కోర్టు ఆంక్షల ఉల్లంఘన లేకుండా చూస్తున్నామని, ఉట్టి కార్యక్రమాలను వీడియోలో చిత్రిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి నిర్వాహకులను నోటీసులు అందజేసినట్టు చెప్పారు. ఇరవై ఏళ్లు ఉంటేనే తప్ప ఉట్టికొట్టే వేడుకల్లో పాల్గొనకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.

చిత్రం..థానేలో గురువారం నిర్వహించిన వేడుకల్లో దహీహండీని అందుకునేందుకు మానవ పిరమిడ్‌గా ఏర్పడుతున్న యువకులు