జాతీయ వార్తలు

యువ జీవితాలతో ఆటలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 25: జమ్మూ, కాశ్మీర్‌లో తాజా అల్లర్లలో పెద్ద ఎత్తున గాయాలకు కారణమైన పెల్లెట్ గన్స్ స్థానంలోనే కొద్ది రోజుల్లోనే ప్రత్యామ్నాయాలను ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. కాశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనకోసం బుధవారం వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన మెహబూబాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాశ్మీర్ లోయలో ఆందోళనకారులను అదుపుచేసే సమయంలో భద్రతా దళాలు ఎంతో సంయమనం పాటిస్తున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. పరిస్థితిని ఎదుర్కొనే సందర్భంలో 4 వేల మందికి పైగా జవాన్లు గాయపడ్డారని ఆయన తెలిపారు. కాశ్మీర్‌లో స్థానికుడు కానీ, సైనికుడు కానీ ఎవరు మరణించినా దేశ ప్రజలు ఎంతో బాధపడతారని ఆయన అంటూ, ‘ఈ పరిస్థితినుంచి కాశ్మీర్‌ను బైటకు తేలేమా? కాశ్మీర్ లోయలోని భావితరాల జీవితాల ఆడుకోవద్దని నేను కాశ్మీర్‌లోని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అన్నారు. జమ్మూ, కాశ్మీర్ ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రవచించిన ‘ఇన్సానియత్, జంబూరియత్, కాశ్మీరీయత్’ పరిధిలో ఎవరితోనైనా చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. త్వరలోనే ఢిల్లీనుంచి అఖిలపక్ష బృందం ఒకటి కాశ్మీర్ లోయకు వెళ్తుందని, దేశంలోని మిగతా ప్రాంతాల్లో నివసించే కాశ్మీరీలు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా పరిష్కరించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఒక నోడల్ అధికారిని నియమిస్తామని ఆయన చెప్పారు. దేశ భవిష్యత్తు కాశ్మీర్ భవిష్యత్తుతో ముడిపడి ఉందని రాజ్‌నాథ్ చెప్పారు.
అల్లర్లకు పాల్పడే గుంపులను అదుపు చేయడానికి పారా మిలటరీ దళాలు ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్స్ వివాదాస్పదంగా మారడం గురించి అడగ్గా, దీనిపై నియమించిన నిపుణుల కమిటీ నివేదిక మూడు నాలుగు రోజుల్లో తమ మంత్రిత్వ శాఖకు అందనుందని రాజ్‌నాథ్ చెప్పారు. పెల్లెట్స్ గన్స్ కారణంగా కాశ్మీర్ లోయలో వందలాది మంది గాయపడ్డమే కాకుండా చూపు కోల్పోయిన విషయం తెలిసిందే. ‘రాబోయే రోజుల్లో పెల్లెట్స్ గన్స్‌కు ఒక ప్రత్యామ్నాయాన్ని అందిస్తాం’ అని హోం మంత్రి చెప్పారు. గత నెల 8వ తేదీన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వనీ భద్రతా దళాల చేతిలో హతమైనప్పటినుంచి కాశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా 66 మందికి పైగా మృతి చెందగా, వేలాది మంది గాయపడిన విషయం తెలిసిందే.