జాతీయ వార్తలు

ప్రీమియం.. 92 పైసలు-- బీమా.. రూ.10 లక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: రైలు టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుంటే కేవలం 92 పైసల ప్రీమియం చెల్లింపుపైన ప్రయాణికులకు పదిలక్షల వరకూ ప్రయాణ బీమా లభిస్తుంది. ఈ నెలాఖరు నుంచి ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలులోకి వస్తుంది. ఐఆర్‌టిసి వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వారికి ఐచ్ఛిక ప్రాతిపదికన ఈ ప్రయాణ బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. టికెట్ల బుకింగ్ సమయంలోనే కేవలం 92పైసలకే పది లక్షల బీమా పొందే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తన బడ్జెట్‌లో ప్రకటించారు. సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ బీమా సౌకర్యం వర్తించదు. మామూలు రైళ్లలో వెళ్లే వారికి ఏ తరగతిలో ప్రయాణం చేసినా కూడా ఈ బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే ఐదేళ్ల లోపు పిల్లలకు, విదేశీయులకు ఇది వర్తించదని, ధృవీకరించిన, ఆర్‌ఎసి, వెయిట్ లిస్టులో ఉన్నవారు మాత్రమే దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. రైలు ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగి సదరు ప్రయాణికుడు మరణించినా, పూర్తి వైకల్యానికి గురైనా పదిల లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లిస్తారు. పాక్షికంగా వైకల్యానికి గురైతే ఏడున్నర లక్షలు, ఆసుపత్రి ఖర్చుల కింద రెండు లక్షలు, ప్రమాదం జరిగిన స్థలం నుంచి మృత దేహాన్ని తీసుకెళ్లేందుకు పదివేలు చెల్లిస్తారు. ఉగ్రవాద దాడి, దోపిడీ, కాల్పులు, దహనకాండ మొదలైన ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. అయితే టికెట్ రద్దు చేసుకుంటే మాత్రం బీమా ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లించరు.