జాతీయ వార్తలు

మాల్యా, లలిత్‌మోదీ సంగతేమిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిగ్బాయ్(అస్సాం), మార్చి 31: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పిస్తానని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్‌లో దాక్కున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, ఐపిఎల్ మాజీ చీఫ్ లిలిత్ మోదీని ఎందుకు తీసుకురాలేకపోతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. గురువారం నాడిక్కడ ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్ ప్రధానిపై విమర్శలు గుప్పించారు.‘విదేశీ బ్యాంకుల్లోంచి నల్లధనం తీసుకొస్తే ఒక్కొక భారతీయుడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమచేయవచ్చని మోదీ చెప్పారు. అయితే వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి బ్రిటన్ పారిపోయిన మాల్యా, లిలిత్ మోదీ సంగతేమిటని నేను అడుగుతున్నాను’అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిలదీశారు. ఒక పక్క నల్లధనం గురించి మాట్లాడుతూ మరోపక్క విజయ్ మాల్యా దేశం విడిచివెళ్లిపోయినా చూస్తూ ఊరుకున్నారని రాహుల్ ధ్వజమెత్తారు.‘లిక్కర్ కింగ్ మాల్యా దేశం విడిచి వెళ్లిపోడానికి రెండు మూడు రోజుల ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలో భేటీ అయ్యా రు’అని ఆయన ఆరోపించారు. పార్లమెంటు హౌస్‌లో జైట్లీ, మాల్యాలు మంతనాలు సాగించారని ఆయన విమర్శించారు. వారిద్దరూ దేని గురించి చర్చించారన్నది బయటపెట్టాలని రాహుల్ నిలదీశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం నల్లధంపై పోరాటం అన్నదాన్ని పక్కనబెట్టి నల్లధనం తెల్లధనం చేసే పథకం చేపట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. బిజెపి ప్రభుత్వం నిజాలు మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. నల్ల కుభేరులకు ఉపశమనం కల్గించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆయన ధ్వజమెత్తారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో మోదీ చెప్పినవన్నీ అభూతకల్పనలేనని, తాము ఏది చెబితే దాన్ని ప్రజలు నమ్ముతారన్న భ్రమల్లో బిజెపి ప్రభుత్వం ఉందని రాహుల్ అన్నారు.