జాతీయ వార్తలు

విదేశీ సిగరెట్లు భారీగా స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 25: తమిళనాడులో భారీగా విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. ప్లైవుడ్ షీట్లుగా పేర్కొంటూ అక్రమంగా రవాణా అయిన ఈ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 7 కోట్ల రూపాయలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు డిఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు చెన్నై సమీపంలోని న్యూ మనాలీలో ఒక కంటెయినర్‌ను సోదా చేయగా ఈ సిగెరట్లు బయటపడ్డాయి. సింగపూర్‌కు చెందిన ఒక ప్రైవేటు సంస్థ అక్రమంగా ఈ సిగరెట్లను స్థానిక దిగుమతిదారుడికి పంపింది. ప్లైవుడ్ షీట్ల కింద దాచి అక్రమంగా రవాణా చేసిన ఈ సిగరెట్లను కస్టమ్స్ చట్టం 1962 కింద అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని దిగుమతి చేసుకున్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని గురువారం చెన్నైలో విడుదల చేసిన ప్రకటనలో డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. ‘మలేసియన్ కోర్ వినీర్’ ప్లైవుడ్ షీట్లుగా పేర్కొంటూ దివ్య ఏజెన్సీస్ అనే సంస్థ అక్రమంగా ఈ సరుకును దిగుమతి చేసుకుందని, అయితే ఆ ప్లైవుడ్ షీట్ల అడుగున 700 కార్టన్లలో ఇండోనేషియాకు చెందిన ఏడు లక్షల ‘జరుమ్ బ్లాక్’ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించామని డిఆర్‌ఐ అధికారులు వివరించారు. రూ.7 కోట్ల విలువ చేసే ఈ సిగరెట్లను కార్టన్లలో ఎంతో పదిలంగా అమర్చి తీసుకొచ్చారని, ఈ సిగరెట్ పెట్టెలపై హెచ్చరిక గుర్తులేవీ లేవని అధికారులు తెలిపారు.