రాష్ట్రీయం

ప్రేమతోనే శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: కాశ్మీర్ సమస్యకు ప్రేమ, ఐక్యతలే అసలు సిసలైన మంత్రాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కాశ్మీర్‌లో అశాంతిని రెచ్చగొట్టడానికి అమాయకులైన చిన్నారులను ఎగదోస్తున్న వారు ఏదో ఒక రోజు వారికి జవాబు చెప్పక తప్పదని కూడా ఆయన అన్నారు. కాశ్మీర్‌లో యువత, జవానుల్లో ఎవరు మరణించినా అది మనకు, దేశానికి తీవ్రమైన నష్టమని నెలవారీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆకాశవాణి ద్వారా చేసిన ప్రసంగంలో ప్రధాని స్పష్టం చేశారు. ప్రసంగంలో అనేక అంశాల గురించి మాట్లాడిన ప్రధాని కాశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతిపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రెండు అంశాలు తెరపైకి వచ్చాయని, వాటిని తేలిగ్గా నిర్వచించాలంటే ఐక్యత, ప్రేమ అనే అంశాలని మోదీ చెప్పారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ప్రధాన సూత్రాలు ఇవేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాశ్మీర్‌పై అన్ని రాజకీయ పార్టీలు ఒకే గొంతుతో మాట్లాడాయని, ప్రపంచానికి, వేర్పాటువాదులకు స్పష్టమైన సందేశాన్ని పంపించడమే కాకుండా కాశ్మీర్ ప్రజలకు మనోభావాలను తెలియజేసేవిధంగా మాట్లాడాయని ఆయన అన్నారు. పంచాయతీ ప్రధాన్ మొదలుకొని ప్రధానమంత్రి దాకా 125 కోట్ల దేశప్రజల అభిప్రాయం ఒక్కటేనని, కాశ్మీర్‌లో ఎవరికి హాని జరిగినా అది దేశానికే హాని అని ఆయన అన్నారు. అన్ని పార్టీలు కలిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లే ఉదాహరణ అని మోదీ చెప్పారు. మనది చాలా పెద్ద దేశమని, భిన్న సంస్కృతులతో కూడుకున్నదని, అందరమూ దాన్ని సంఘటితంగా ఉంచడానికి ప్రయత్నించాలని అంటూ అప్పుడే దేశానికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. దేశ ప్రజల శక్తిపై తనకు నమ్మకం ఉందన్నారు.
35 నిమిషాల పాటు మోదీ చేసిన ప్రసంగంలో రియో ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు సాధించిన పివి సింధు, సాక్షి మాలిక్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. ఆడబిడ్డలు దేశానికి పతకాలు సాధించి పెట్టారన్నారు. జిమ్నాస్టిక్స్‌లో దీపాకర్మాకర్ పతకం గెలుచుకోకపోయినా దేశ ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. ఆలాగే సింధు కోచ్ గోపీచంద్‌ను కూడా ఆయన ప్రశంసించారు. అయితే మొత్తం మీద ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల తీరు నిరాశ కలిగించిందంటూ, అందుకే రాబోయే ఒలింపిక్స్ కోసం ఇప్పటినుంచే దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. వాటికన్‌లో సెప్టెంబర్ 4న మదర్ థెరెసాకు సెయింట్‌హుడ్ ఇచ్చే కార్యక్రమానికి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరవుతారని ప్రధాని చెప్పారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని ఉపాధ్యాయుడు-విద్యార్థి మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. అయితే జి-20 సదస్సులో పాల్గొనడం కోసం చైనా వెళ్తున్నందున టీచర్స్ డే కార్యక్రమాల్లో తాను పాల్గొనలేక పోతున్నట్లు చెప్పారు. ప్రధాని తన ప్రసంగంలో గంగానదిని శుభ్రం చేయడానికి చేస్తున్న కృషి, స్వచ్ఛ్భారత్ అభియాన్ విజయవంతం చేయటం, పర్యావరణానికి హాని చేయని విధంగా గణేశ్ ఉత్సవాలను జరుపుకోవటం వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.