జాతీయ వార్తలు

వాహనాల స్క్రాపింగ్ పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: పదిహేను సంవత్సరాలు, అంతకు పైబడిన దాదాపు 15 లక్షల భారీ వాహనాలను మొదటి దశలో రద్దుగా మార్చడానికి ఉద్దేశించిన వాహనాల రద్దు విధానం ముసాయిదా 15 రోజుల్లో సిద్ధమవుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అపతిపాదిత వలంటరీ వెసికిల్ ఫ్లీట్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్(వి-విఎంపి) పథకం తొలి దశ కింద 12నుంచి 15 లక్షల దాకా 15 ఏళ్లకు పైబడిన భారీ వాహనాలను రద్దు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ పిటిఐకి చెప్పారు. వాహన కాలుష్యంలో దాదాపు 65 శాతం పాత బడిన భారీ వాహనాల వల్లనే జరుగుతోందని, ఈ వాహనాలను స్క్రాప్‌గా మార్చడం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు కింద ఏర్పాటు చేయబోయే కాండ్లా లాంటి పారిశ్రామిక క్లస్టర్లలో జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించి గడ్కరీ గత వారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవగా, ఈ పథకాన్ని స్వచ్ఛందం కాకుండా తప్పనిసరి చేయాలని జైట్లీ సూచించారు. ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇవ్వడానికి బదులు బడ్జెట్‌లో దీనికోసం నిధులు కేటాయిస్తామని కూడాజైట్లీ సూచించారు. ఈ పథకం కింద స్క్రాప్‌గా మార్చే ప్రతి భారీ వాహనానికి 2-3 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలు అందుతాయని గడ్కరీ తెలిపారు. 2006 మార్చి 31న లేదా అంతకు ముందు కొనుగోలు చేసిన దాదాపు 2.8 కోట్ల వాహనాలను ఈ పథకం కిందికి తీసుకు రావాలని ఇంతకు ముందు వి-విఎంపి పాలసీ ముసాయిదాలో ప్రతిపాదించారు. అలాగే జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందిన దృష్ట్యా పన్ను విధానంలో మార్పు రానున్న దృష్ట్యా ప్రభుత్వం దీనిపై జిఎస్‌టి కౌన్సిల్‌ను సంప్రదించాలని కూడా అనుకుంటోంది.