ఆంధ్రప్రదేశ్‌

కాశ్మీర్‌లో కర్ఫ్యూ ఎందుకు తొలగించలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీబాత్ కార్యక్రమంలో భాగంగా కాశ్మీర్ సమస్యపై వ్యక్తం చేసిన అభిప్రాయాలను కాంగ్రెస్, జెడి(యు)లు తప్పుబట్టాయి. 5 శాతం మంది మాత్రమే కాశ్మీర్‌లో హింస ను ప్రేరేపిస్తున్నారని ప్రధాని మోదీ అనుకుంటున్నట్లయితే ఇంకా అక్కడ ఎందుకు కర్ఫ్యూను ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు. ‘కేవలం 5 శాతం మందే అల్లర్లు సృష్టిస్తున్నారని ప్రధాని భావిస్తూ ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఎందుకు ఆపలేదు? 51 రోజులుగా కర్ఫ్యూను ఎందుకు కొనసాగిస్తున్నారు’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ‘అక్కడ సాధారణ జన జీవితం ఎందుకు స్తంభించి పోయింది? ఇంటర్నెట్ సేవలు ఎందుకు నిలిపి వేశారు? ప్రధాని తన మనసులో మాటను చెప్పడం కాకుండా కాశ్మీర్ ప్రజల మనసులోని మాటను కూడా వినాలి’ అని తివారీ అన్నారు. కాశ్మీర్ సమస్యపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ, కాశ్మీర్‌లో శాశ్వత శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోందని, అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రకనలను బట్టి చూస్తే అలా జరిగేట్లు కనిపించడం లేదని అన్నారు. ‘కాశ్మీర్‌లో శాశ్వత శాంతి నెలకొనాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. గాయాలను మాన్పడం ద్వారా, అభివృద్ధి ప్రక్రియను చేపట్టడం ద్వారా, జాతీయ జనజీవన స్రవంతికి దూరంగా వెళ్లినవారిని తిరిగి తీసుకురావడం ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. ప్రధాని మోదీ ఆ పని చేయాలనుకుంటున్నారా అంటే లేద నే అనిపిస్తోంది. మెహబూబా ముఫ్తీ అలా చేయాలనుకుంటున్నారా అని అంటే ఆమె ప్రకటన దాన్ని నిరూపించడం లేదు’ అని సుర్జేవాలా అన్నారు. కాగా, ప్రధాని ఏదయినా చొరవ తీసుకుంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆయనను సమర్థిస్తుందని జనతాదళ్(యు) సీనియర్ నాయకుడు కెసి త్యాగి అన్నారు. పాకిస్తాన్‌తో మామూలు సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఆయన ప్రయత్నించారు.