జాతీయ వార్తలు

నియోజకవర్గం వెలుపల వ్యయం వ్యక్తిగతం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఒక పార్టీకి చెందిన ‘స్టార్ క్యాంపెయినర్’ తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం వెలుపల తన పార్టీ కోసం ప్రచారం చేయడానికి హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తే అందుకు అయ్యే వ్యయం ఆయన వ్యక్తిగత ఎన్నికల ప్రచార వ్యయం పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర మాజీ మంత్రి అర్జున్ సింగ్ తనయుడు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే అజయ్ అర్జున్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జె.చలమేశ్వర్, ఎ.ఎం.సప్రేతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. అజయ్ అర్జున్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్ అయినందున తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం వెలుపల కూడా పార్టీకోసం ప్రచారం చేయవలసిన అవసరం ఉందని పేర్కొంటూ ఆయనకు వ్యతిరేకంగా దాఖలయిన ఎన్నికల పిటిషన్‌లోని ఎన్నికల వ్యయానికి సంబంధించిన పేరాగ్రాఫ్‌ను తొలగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల సంఘానికి ముందే సమర్పించిందని పేర్కొంటూ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 77 ప్రకారం స్టార్ క్యాంపెయినర్ తన నియోజకవర్గం వెలుపల పార్టీ కోసం చేసే ప్రచార వ్యయం అతని వ్యక్తిగత ఎన్నికల వ్యయం పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లోని చురాహత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2013 ఎన్నికల్లో అజయ్ అర్జున్ సింగ్ గెలుపొందారు.
ఆ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన బిజెపి అభ్యర్థి శరదేందు తివారి అజయ్ అర్జున్ సింగ్‌కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఎన్నికల వ్యయానికి సంబంధించి శరదేందు తివారి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయవలసిందిగా కోరుతూ అజయ్ అర్జున్ సింగ్ చేసిన విజ్ఞప్తిని మధ్యప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అజయ్ అర్జున్ సింగ్ తన నియోజకవర్గం వెలుపల జిల్లా కేంద్రంలో, ఇతర చోట్ల నిర్వహించిన సభల్లో ప్రసంగించడానికి హెలికాప్టర్లలో తిరిగారని, అందుకు అయిన వ్యయాన్ని తన ఎన్నికల వ్యయంలో చూపించలేదని శరదేందు తివారి మధ్యప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు.