జాతీయ వార్తలు

ఎగతాళి చేయడం మీ నైజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్గారీ, మే 15: దేశాన్ని ఒకే ఒక వ్యక్తి పాలించవచ్చన్న భ్రమల్లో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘జాతి అంటే ప్రజా సమూహం. అందరి సమష్టి సహకారం, భాగస్వామ్యంతోనే దేశం ముందుకెళ్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. ‘ఇంతకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మోదీ ఎగతాళి చేసేవారు. ఎగతాళి చేయడం మీ నైజం.. అయతే ఐదేళ్ల తరువాత మన్మోహన్‌ను ఎగతాళి చేయడానికి మోదీజీకి ఏమీ మిగల్లేదు. నేడు మోదీ చేతిలో దేశమే ఎగతాళి గురైంది’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గంలోని బర్గారీలో బుధవారం ఆయన ఎన్నికల ర్యాలీలో 2015లో జరిగిన ఘటనను గుర్తుచేశారు. సిక్కుల పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేసిన దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మతఘర్షణలకు బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశిస్తామని ఆయన అన్నారు. కాగా మంగళవారం బటిండాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌పై విరుచుకుపడ్డారు. మోదీది ఒన్‌మేన్‌షో అని ఆమె విమర్శించారు. రాఫెల్ ఒప్పందం, అవినీతి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు రాకుండా ప్రధాని తప్పించుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. బీజేపీ జీఎస్టీని గబ్బర్‌సింగ్ టాక్స్‌గా గాంధీ అభివర్ణించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయని బర్గారీ ఎన్నికల సభలో రాహుల్ విరుచుకుపడ్డారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమచేస్తామన్న మోదీ హామీ ఏమైందని ఆయన నిలదీశారు. రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ మాటతప్పారని రాహుల్ విమర్శించారు.
చిత్రం...పంజాబ్‌లోని లూథియానాలో ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అనంతరం ట్రాక్టర్ నడుపుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్. చిత్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తదితరులు