జాతీయ వార్తలు

ఆదిత్య తల్వార్ ‘పలాయనవాది’: ఈడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ప్రభుత్వాలతో లాబీయింగ్‌లు నిర్వహించే దీపక్ తల్వార్ కుమారుడు ఆదిత్య తల్వార్‌ను ‘పలాయనం చిత్తగించిన వ్యక్తిగా’ పేర్కొనాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు నష్టాలు కలిగించే విధంగా వ్యవహరిస్తూ ప్రైవేటు ఎయిర్‌లైన్స్ లబ్ధి కలిగేలా చేసిన అదిత్య తల్వార్‌పై చర్య తీసుకోవాలని ఈడీ హైకోర్టును కోరింది. ఈ కేసులో ఈడీ ఫైల్ చేసిన చార్జిషీట్‌పై ఆదిత్య తల్వార్‌పై కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్‌ను గతంలో జారీ చేసింది. దీపక్ తల్వార్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. పౌరవిమానయాన మంత్రిత్వ వాఖ, ఎయిర్ ఇండియా అధికారుల ‘ప్రభుత్వ వ్యతిరేక పాత్ర’ వ్యవహరంలో వారి పేర్లను దీపక్ తల్వార్ ద్వారా రాబట్టాల్సిన అవసరం ఉందని ఈడీ పేర్కొంది. కతార్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా వంటి విదేశీ ఎయిర్‌లైన్స్‌లకు లబ్ధి చేకూర్చే విధంగా వీరు వ్యవహరించారని ఈడీ పేర్కొంది.