రాష్ట్రీయం

సెలబ్రిటీలూ జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29:పుంఖానుపుంఖాలుగా వచ్చే ప్రకటనల్లో నటించే సెలట్రిటీలు జాగ్రత్తగా ఉండాల్సిందే! విచక్షణతో వ్యవహరించక పోతే జైలుపాలు కావడమే కాదు భారీగా జరిమానా కూడా కట్టాల్సిందే..ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలకు ఐదేళ్ల జైలు శిక్ష, 50లక్షల రూపాయల జరిమానా విధించేందుకు ఓ బిల్లు సిద్ధమవుతోంది. ఈ ముసాయిదా బిల్లులో వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రతిపాదించిన సవరణలను పరిశీలించేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని మంత్రుల బృందం మంగళవారం సమావేశం కాబోతోంది. ఈ సవరణల పరిశీలనానంతరం బిల్లును కేబినెట్ ఆమోదానికి నివేదిస్తారు.గత మూడు దశాబ్దాలుగా కొనసాగిన వినియోగదారుల రక్షణ చట్టాన్ని రద్దు చేస్తూ వినియోగదారుల పరిరక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం గత ఏడాది లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. దీన్ని పరిశీలించిన అనంతరం పార్లమెంటరీ స్థారుూ కమిటీ తన సిఫార్సులతో ఈ ఏడాది ఏప్రిల్‌లో నివేదికనందించింది. ప్రకటనల్లో నటించే సెలబ్రిటీల బాధ్యతను నిర్థారించడం, కల్తీ తదితర నేరాలకు కఠిన శిక్షలు విధించడం
సహా కొన్ని కీలక సిఫార్సులతో పార్లమెంటరీ కమిటీ తన నివేదికను అందించింది. వాటిని వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ముసాయిదా బిల్లుపై ఇతర మంత్రిత్వ శాఖ అభిప్రాయాలనూ సేకరించింది. తప్పుడు ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదనను అన్ని మంత్రిత్వ శాఖలూ ఆమోదించాయి. బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించే సెలబ్రిటీలకు మొదటిసారి తప్పిదానికి పది లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. రెండోసారీ తప్పు చేస్తే ఐదేళ్ల జైలు, 50లక్షల జరిమానా విధిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.