జాతీయ వార్తలు

నీకు బుద్ధుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ఎన్నికల సంఘం తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే బూత్‌లలో రీపోలింగ్ పెడితే మీరెందుకు అభ్యంతరం పెడుతున్నారని ప్రశ్నించిన ఆంధ్రభూమి విలేకరిపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చిందులు వేశారు. ‘నీకు బుద్ధుందా, బుద్ధి ఉండే ఈ ప్రశ్న అడుగుతున్నావా’ అంటూ రమేష్ నోరు పారేసుకున్నారు. రమేష్ ఆంధ్రభూమి విలేఖరిని దుర్భాషలాడుతుంటే పక్కనే ఉన్న కంభంపాటి రామమోహన్‌రావు వౌనం వహించారు తప్ప కలగజేసుకుని రమేష్‌ను వారించలేదు. విలేఖరుల సమావేశం ముగిసిన అనంతరం ఆంధ్రభూమి విలేఖరి రమేష్ వద్దకు వెళ్లి మీరెందుకలా మాట్లాడారని అడుగ్గా ఆయన కోపంతో మరోసారి ‘నీకు బుద్ధిలేదు.. అందుకే అలాంటి ప్రశ్న అడిగావు’ అంటూ మళ్లీ దుర్భాషలాడారు. రమేష్, కంభంపాటి రామమోహన్‌రావు గురువారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ పెట్టడాన్ని నిరసిస్తూ ఒక వినతిపత్రం అందజేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయగానే ఎలాంటి విచారణ జరపకుండా ఐదు పోలింగ్ కేంద్రా ల్లో రీపోలింగ్‌కు ఆదేశించటాన్ని వారు నిలదీశారు. ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘంపై వారు విమర్శలు గుప్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం వారు విలేఖరులతో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మొదట ప్రశాంతంగా సమాధానాలు ఇచ్చిన రమేష్ ఆంధ్రభూమి విలేకరి ప్రశ్న వేయగానే కోపంతో ఊగిపోయారు.
తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెడితే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారన్న ప్రశ్న రమేష్‌కు ఎందుకు కోపం తెప్పించిందనేది అర్థం కావటం లేదు.