జాతీయ వార్తలు

23న మోదీకి బై బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిక్రమ్ (బీహార్), మే 16: ఈనెల 23న ప్రధాని నరేంద్ర మోదీకి బై బై చెబుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభకు 19న చివరి విడత పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. పాటలీ పుత్ర సెంగ్మెంట్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రధాని మోదీని నిలదీశారు. పేదల బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చేసిన హామీలను బీజేపీ మరిచిపోయిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాహుల్ అన్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, ఓటమి పాలయ్యే మోదీకి దేశ ప్రజలు బై బై చెబుతారని రాహుల్ అన్నారు. మోదీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎక్కడా మాట్లాడడం లేదని అన్నారు. రాఫెల్ ఓప్పందంపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. అనీల్ అంబానీకి కాంట్రాక్ట్ ఎలా దక్కిందో వివరించాలని నిలదీశారు. గతంలో కుదిరిన ఓప్పందాని కంటే ఎక్కువ మొత్తానికి యుద్ధ విమానాలను ఎందుకు కొనుగోలు చేశారని అడిగారు. ఈ విషయంలో తాను బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. తమ పార్టీ అమలు చేయబోయే ‘న్యాయ్’ పథకం ద్వారా పేదలందరికీ న్యాయం చేకూరుతుందని అన్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు ఏడాదికి 72వేల రూపాయలను అందజేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలను అభివృద్ధి పరిచి ఉద్యోగితా శాతాన్ని పెంచుతామన్నారు. బీజేపీ సర్కారు తీరు వల్ల నష్టపోయిన అన్ని రంగాలను గాడిలో పెడతామని రాహుల్ తెలిపారు.