హైదరాబాద్

13 నగరాల్లో మ్యూజియం డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా దేశంలోని 13 ప్రధాన నగరాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. దివ్వాంగులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటవుతున్నాయి. వారం రోజుల పాటు కార్యక్రమాలుంటాయని నిర్వాహకులు తెలిపారు. సహాపీడియా అనే సంస్థ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. చరిత్ర, సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ‘మ్యూజియమ్స్, కల్చరల్ హబ్స్: ద ఫ్యూచర్ ఆఫ్ ట్రెడేషన్’ పేరుతో వీటిని నిర్వహిస్తారు. 17న కోల్‌కతాలోని జాదవ్‌వూర్ వర్శిటీలో శాస్ర్తియ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఆరోజే అంతర్జాతీయ మ్యూజియం డే. 18న వారసత్వ నడక కార్యక్రమం ఉంటుంది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, ప్రయాగ్‌రాజ్, వారణాసి నగరాల్లో నడక కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే నేషనల్ మ్యూజియం (్ఢల్లీ), చత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయ(ముంబయి), ఆంటిక్యూస్ మ్యూజియం(పాటియాల), కమల్ వార్ మ్యూజియం (షిల్లాంగ్), ఆర్కిటెక్చర్ మ్యూజియం(చండీగఢ్)లో కార్యక్రమాలుంటాయి. దక్షిణ భారతంలోని కోచీ, బెంగళూరులో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పటు చేశారు.