జాతీయ వార్తలు

23న రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ పార్లమెంటు ఏర్పడే పక్షంలో కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ నెల 23న ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు సాయంత్రం తన అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలను కూడా ఆహ్వానించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సూచన మేరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో తెరవెనక చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కమల్‌నాథ్ చర్చలు సఫలమైతే టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, జగన్‌మోహన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు అవసరమైతే కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్‌మోహన్ రెడ్డి గతంలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పటం తెలిసిందే. కేంద్రంలో ప్రతిపక్షాల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖరరావు, జగన్‌మోహన్ రెడ్డి సమ్మతించే పక్షంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా తయారైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏను ఎదుర్కొనేందుకు మహాకూటమి పేరుతో ప్రతిపక్షాలను సమీకరించేందుకు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు కొంతవరకు ఫలించినా ఆ తరువాత అవి వికటించాయి. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మహాకూటమిని వ్యతిరేకించటంతో చంద్రబాబు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, ప్రియాంక ఇప్పుడు చంద్రబాబుకు బద్దశత్రువులైన చంద్రశేఖరావు, జగన్‌మోహన్ రెడ్డితో చేతులు కలిపేందుకు పావులు కదపటం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 23న ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం అందిందా లేదా అనేది స్పష్టం కావటం లేదు. అయితే డీఎంకే, తదితర యుపీఏ మిత్రపక్షాలకు సోనియా గాంధీ ఆహ్వానం అందింది. సోనియా గాంధీ ఏర్పాటు చేసిన సమావేశానికి తాము హాజరవుతున్నామని డీఎంకే నాయకుడొకరు తెలిపారు. ఇదిలాఉంటే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రం కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలో చేరేందుకు సుముఖత చూపించలేదని అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫని తుపాను మూలంగా ఒడిశాలో జరిగిన నష్టాన్ని సమీక్షించేందుకు వెళ్లినప్పుడు నవీన్ పట్నాయక్‌తో ముఖాముఖి చర్చలు జరిపారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైతే మద్దతు ఇవ్వాలని నరేంద్ర మోదీ ఆయనను కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవీన్ పట్నాయక్ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో యుపీఏ మిత్రపక్షాలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అంగీకరించవచ్చునని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టకుండా చూసేందుకు ఆమె రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థించేందుకు వెనుకాడరని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కేంద్రంలో ప్రతిపక్షాల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనేది స్పష్టం కావటం లేదు. ప్రధాన మంత్రి పదవిని ఆశిస్తున్న మాయావతి రాహుల్ గాంధీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమ్మతిస్తారా అనేది ఆలోచించవలసి ఉంటుంది. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపట్టటం తనకు ఇష్టం లేదని ఇంతకుముందు ప్రకటించిన ఎన్‌సీపీ అధినాయకుడు శరద్ పవార్ యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ విజ్ఞప్తి మేరకు తన ఆలోచనను మార్చుకుంటారా అనేది ప్రశ్న.
చిత్రం...యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ