జాతీయ వార్తలు

ప్రధాని పదవి రాకున్నా ఫరవాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టకుండా చూసేందుకు మిత్రపక్షాలకు ప్రధాన మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. కేంద్రంలో మరోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చూడటమే ప్రధాన లక్ష్యం.. ఈ లక్ష్య సాధనకోసం తమకు ప్రధాన మంత్రి పదవి లభించకపోయినా ఫరవాలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ గురువారం బిహార్ రాజధాని పాట్నాలో చేసిన ప్రకటన కాంగ్రెస్ వ్యూహానికి అద్దం పడుతోంది. ఎన్‌డీఏ రెండోసారి అధికారంలోకి రాకుండా చూడాలన్నదే తమ లక్ష్యం, దీనికోసం తమకు ప్రధాన మంత్రి పదవి లభించకపోయినా ఫరవాలేదని ఆజాద్ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి పదవి చేపట్టాలని మిత్రపక్షాలన్నీ ఏకగ్రీవంగా నిర్ణయించినప్పుడే తమ పార్టీ అధినాయకుడు ప్రధాన మంత్రి పదవి చేపడతారు.. దీనికి బదులు ప్రతిపక్షానికి చెందిన మరో నాయకుడిని ప్రధాన మంత్రిగా నియమించాలంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆజాద్ ప్రకటించారు. ఎన్‌డీఏ అధికారంలోకి రాకుండా చూసేందుకు తాము ఎంత దూరమైన వెళతామని ఆయన తెలిపారు. తమ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రతిపక్షం వెల్లడించాలంటూ హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ప్రశ్నించిన నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ గురువారం ఈ ప్రకటన చేయటం గమనార్హం. ప్రధాన మంత్రి పదవి విషయంలో ప్రతిపక్షంలో ఏకాభిప్రాయం లేదు.. ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నాయకులందరూ ప్రధాన మంత్రి పదవిని కోరుకుంటున్నారని రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేయటం తెలిసిందే.

చిత్రం...పాట్నాలో విలేఖరుల సమావేశంలో ఆజాద్