జాతీయ వార్తలు

గాడ్సే దేశభక్తుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. బీజేపీ అధినాయకత్వం మందలించటంతో ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతోపాటు జరిగిన దానికి క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. నాథురాం గాడ్సే మొదటి హిందూ ఉగ్రవాది అంటూ తమిళనాడుకు చెందిన మక్కల్ నీతి మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ చేసిన ఆరోపణకు మీరేం సమాధానం చెబుతారని ఒక విలేఖరి ప్రశ్నించగా.. ‘నాథురాం గాడ్సే దేశ భక్తుడు.. ఆయనను ఉగ్రవాది అని పిలిచేవారికి ప్రజలీ ఎన్నికల్లో గట్టి సమాధానం ఇస్తారు’ అని సాధ్వి బదులిచ్చారు. సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో వివాదాస్పద మయ్యాయి. సాధ్విని వెంటనే బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సేను దేశభక్తుడన్నందుకు బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. చివరకు బీజేపీ కూడా ప్రజ్ఞా ఠాకూర్ అభిప్రాయాన్ని తీవ్రంగా ఖండించింది. గాడ్సే దేశభక్తుడనేది ప్రజ్ఞా ఠాకూర్ వ్యక్తిగత అభిప్రాయమని.. అది పార్టీ అభిప్రాయం కాదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వివరణ ఇచ్చారు. ప్రజ్ఞా ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన విలేఖరులకు చెప్పారు.
ప్రజ్ఞాసింగ్ క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్
మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ వినాయక్ గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆమెపై ప్రధాని మోదీ తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ గాడ్సేను దేశభక్తుడిగా చెప్పడం ద్వారా యావత్ దేశాన్ని ప్రజ్ఞాసింగ్ అవమాన పరిచారని ధ్వజమెత్తారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేయడమే ఏ విధంగా సమర్థిస్తారో బీజేపీ స్పష్టం చేయాలని ఆయన అన్నారు. ఈ ప్రకటన ప్రజ్ఞాసింగ్ వ్యక్తిగత అభిప్రాయమంటూ బీజేపీ తప్పించుకోవాలని చూస్తున్నారని సుర్జేవాలా ఆరోపించారు.
ప్రజ్ఞాసింగ్ యూ టర్న్
నాథూరామ్ గాడ్సేను దేశ భక్తుడిగా అభివర్ణించిన ప్రజ్ఞాసింగ్ ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉప సంహరించుకుంటున్నానని ఒక ప్రకటనలో తెలిపారు. తాను పొరపాటుగా వ్యాఖ్యలు చేశానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.