జాతీయ వార్తలు

ముందుకెళ్లొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: తెలంగాణ వర్శిటీలకు వీసీల నియామకంలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉపకులపతుల నియామకాలపై ప్రభుత్వ ఉత్తర్వులను ధర్మాసనం సమర్థించింది. ఇప్పటికే నియమితులైన వీసీలను యథాతథంగా కొనసాగించొచ్చని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయాలు సహా, వర్శిటీలు వెలువరించే అభిప్రాయాలపై వివరణలు, స్పందన తెలియజేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. వీసీల నియామకాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ గత నెలలో ప్రొఫెసర్ మనోహర్ రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటీషన్‌ను విచారించిన హైకోర్టు నియామకాలపై స్టే ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణకు నాలుగు వారాల గడువు విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గత సోమవారం వాదనలు విన్న సుప్రీం కోర్టు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టేటస్‌కో విధించింది. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకుర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఖాన్‌వాల్కర్‌లతో కుడిన ధర్మాసనం కేసును విచారించింది. ధర్మాసనం ఎదుట తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తూ వర్శిటీలకు వీసీలను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్నారు. అలాగే 2010 యూజీసీ మార్గదర్శకాలను ఉమ్మడి రాష్ట్రం అవలంభించిందని, రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అవే మార్గదర్శకాలను అన్వయించుకుంటూ స్వల్ప మార్పులు చేసుకుందని వివరించారు. విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం వీసీల నియామక హక్కు ప్రభుత్వానికి ఉందని వాదించారు. గతంలో మధురై వర్శిటీ, కళ్యాణి మథివన్నన్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. అప్పటి సుప్రీం తీర్పు ప్రకారం, ప్రస్తుతం తెలంగాణ అనుసరిస్తున్న విధానం సరైనదేనని వాదించారు. మనోహర్ రావు తరఫున సీనియర్ న్యాయవాదులు సియుసి సింగ్, ఆదినారాయణ వాదనలు వినిపిస్తూ, యుజిసి మార్గదర్శకాల ప్రకారం వీసీల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేదని, చట్టాన్ని సవరించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. ఆంధ్ర ఎటువంటి విధానాన్ని అనుసరిస్తున్న సిజె ప్రశ్నకు సమాధానమిస్తూ, ఏపీ ఎలాంటి సవరణలు చేయలేదని, యుజిసి మార్గదర్శకాలనే వ్యవహరిస్తోందని కోర్టుకు విన్నవించారు. వాదనల అనంతరం సిజెతో కూడిన ధర్మాసనం, తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ తదితర పలు వర్శిటీల తరఫున ఎవ్వరూ హాజరుకానందువల్ల అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరనున్నట్టు తెలిపింది. అలాగే తెలంగాణ అభిప్రాయాలతోపాటు, త్వరలో వర్శిటీలు వెలువరించే అభిప్రాయాలపై వివరణలు, స్పందనను తెలియజేయాలనిప్రతివాదులకు ధర్మాసనం నోటిసులు జారీ చేసింది. అయితే, తదుపరి విచారణ తేదీని ప్రధాన న్యాయమూర్తి ప్రకటించలేదు.