జాతీయ వార్తలు

‘శత్రు ఆస్తుల’పై 4వ ఆర్డినెన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్డినెన్స్, ఆగస్టు 29: పాకిస్తాన్, చైనాలతో యుద్ధాల తరువాత భారత్‌నుంచి ఆయా దేశాలకు వలసపోయినవారి ఆస్తులపై తమకు హక్కు ఉందని వారి వారసులెవరూ వాదించకుండా నిరోధించడానికి సుమారు 50 ఏళ్లనాడు రూపొందించిన శత్రు ఆస్తుల (ఎనెమి ప్రాపర్టీ) చట్టాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగోసారి ఆర్డినెన్స్ జారీ చేసింది. శత్రువు లేదా శత్రు సంస్థకు చెందిన ఆస్తులను లేదా అవి నిర్వహించిన ఆస్తులను శత్రు ఆస్తులు (ఎనెమి ప్రాపర్టీ)గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆస్తులను స్వాధీనం చేసుకొని, తాను ఏర్పాటు చేసిన ‘కస్టోడియన్ ఆఫ్ ఎనెమి ప్రాపర్టీ ఫర్ ఇండియా’ (సిఇపిఐ) సంరక్షణలో ఉంచింది. 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం తరువాత 1968లో భారత్ ఈ ఎనెమి ప్రాపర్టీ చట్టాన్ని రూపొందించింది. అయితే ఈ చట్టంలోని కొన్ని లోపాలను సరిదిద్దడానికి పూనుకున్న కేంద్రం అందుకు అనుగుణంగా సవరణ ఆర్డినెన్స్‌లను జారీ చేస్తోంది. ‘ద ఎనెమి ప్రాపర్టీ (అమెండ్‌మెంట్ అండ్ వ్యాలిడేషన్) ఫోర్త్ ఆర్డినెన్స్, 2016’ను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం జారీ చేసినట్లు అధికారిక నోటిఫికేషన్ తెలిపింది. కేంద్రం తొలి ఆర్డినెన్స్‌ను జనవరి ఒకటో తేదీన, రెండో ఆర్డినెన్స్‌ను ఏప్రిల్ రెండో తేదీన, మూడో ఆర్డినెన్స్‌ను మే 31న జారీ చేసింది. అయితే ఈ మూడో ఆర్డినెన్స్ గడువు ఆదివారంతో ముగిసిపోయింది. కాని, ఈ సవరణ బిల్లు ఇంకా చట్టరూపం దాల్చలేదు. మార్చి 9న లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు ఇంకా రాజ్యసభ ఆమోదం పొందలేదు. రాజ్యసభ ఈ బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపించింది. బిల్లు చట్టరూపం దాల్చకపోవడం, మూడో ఆర్డినెన్స్ గడువు ముగిసిపోవడంతోపాటు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరగకపోవడంవల్ల నాలుగోసారి ఆర్డినెన్స్‌ను జారీ చేయవలసి వచ్చింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి పట్ల సంతృప్తి చెందిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే నాలుగోసారి ఆర్డినెన్స్‌ను జారీ చేశారని అధికారిక నోటిఫికేషన్ వివరించింది.