జాతీయ వార్తలు

ఎవరి అదృష్టం ఎలా ఉందో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మే 18: బిహార్‌లో ఆదివారం జరిగే లోక్‌సభ ఆఖరి విడత పోలింగ్‌లో నలుగురు కేంద్ర మంత్రులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పాట్నా సాహిబ్, పాటలీపుత్ర, అర్రా, బక్సర్, కరాకట్, ససారాం, నలంద, జెహానాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు. నలుగురు కేంద్ర మంత్రులతో పాటు 157 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 1.52 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం 15,811 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏడు చోట్ల గతంలో ఎన్‌డీఏ అభ్యర్థులు గెలిచారు. బీజేపీకి ఐదు, ఆర్‌ఎల్‌ఎస్‌పీకి రెండు సీట్లు గెలుచుకున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నాయకత్వంలోని జేడీయూ ఒంటరిగా పోటీలో ఉన్నప్పటికీ వెనక నుంచి ఎన్‌డీఏ మద్దతు ఇస్తోంది. ఆర్‌ఎల్‌డీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మహ్మద్ ఇలియాస్ హుస్సేన్‌పై గత ఏడాది అనర్హత వేటు పడడంతో డెహ్రీ అసెంబ్లీ నియోజవర్గంలో ఖాళీ ఏర్పడింది. లోక్‌సభతో పాటు డెహ్రీ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతోంది. రాంచీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న తారు కుంభకోణం కేసులో హుస్సేన్ దోషిగా తేలడంతో అనర్హత వేటు పడింది. పాట్నా సాహిబ్ స్థానంలో పోటీ అత్యంత ప్రతిష్టాత్మంగా మారింది. నరేంద్ర మోదీ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో గతంలో బీజేపీ రెండు సార్లు గెలిచింది. మంత్రి ప్రసాద్ సిట్టింగ్ ఎంపీ శతృఘ్నసిన్హాను ఢీ కొంటున్నారు. బాలీవుడ్ యంగ్రీమెన్‌గా పేరున్న సిన్హా గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మోదీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచిన శతృఘ్నసిన్హా బీజేపీ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. మొత్తానికి హైకమాండ్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే పాట్నా సాహిబ్ పొరుగునే ఉన్న పాటలీపుత్ర నియోజకవర్గంలోనూ రసవత్తర పోటీ నెలకొంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు పట్టుదలగా పనిచేస్తున్నారు. గతంలో లాలూనే జేడీయూ అభ్యర్థి రంజన్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. అలాగే ఆయన కుమార్తె మిసా భారతి బీజేపీ నేత రామ్‌కృపాల్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. భారతి మరోసారి యాదవ్‌ను ఢీకొంటున్నారు. అర్రా నియోజకవర్గంలో మరో కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ పోటీలో ఉన్నారు. ఐఏఎస్ అధికారి సింగ్ కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శిగా పనిచేసిన రిటైరైన తరువాత బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ సారి ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. సింగ్‌పై సీపీఎం(ఎంఎల్) అభ్యర్థి రాజు యాదవ్ పోటీ చేశారు. రాజు యాదవ్‌కు ఆర్‌జేడీ సారధ్యంలోని మహాకూటమి మద్దతు ఇస్తోంది. మిసా భారతికి వామక్షాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో అర్రాలో రాజుకు మద్దతు తెలిపింది. ఇక బక్సర్ విషయానికొస్తే కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చూబే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆర్‌జేడీ నేత జగదానంద్ సింగ్‌ను ఆయన ఢీకొంటున్నారు. గతంలో సింగ్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కరాకట్‌లో ఆర్‌ఎల్‌ఎసీ చీఫ్ ఉపేంద్ర కుష్వా మళ్లీ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిలో ఉండి గెలిచిన ఆయన గత డిసెంబర్‌లోనే బయటకు వచ్చి మహాకూటమిలో చేరారు. ఇక్కడ గట్టిపోటీనే ఉంది. జేడీయూ అభ్యర్థి మహాబలి సింగ్‌తో కుష్వా పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో ససారం లోక్‌సభ ఒకటి. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ మిరాకుమార్ బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి రెండుసార్లు గెలిచిన మిరాకుమార్ 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఛెడీ పాశ్వాన్ చేతిలో ఓటమి చెందారు. 1989,91లో జనతాదళ్ టికెట్‌పై పోటీ చేసిన పాశ్వాన్ ఘన విజయం సాధించారు. ససారం నుంచి మిరాకుమార్ తండ్రి, ఉప ప్రధాని జగ్జీవన్‌రాం అనేక పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు. ఎక్కువ సార్లు కాంగ్రెస్ టికెట్‌పైనే గెలిచిన ఆయన రెండు సార్లు జనతాపార్టీ టికెట్‌పై పోటీ చేసి ఘన విజయం సాధించారు. నలంద లోక్‌సభ నియోజకవర్గంలో జేడీయూ ఎంపీ కుశాలేంద్ర కుమార్ రెండోసారి బరిలో ఉన్నారు. ఆయనపై హిందూస్తానీ అవామ్ మోర్చ అభ్యర్థి అశోక్‌కుమార్ ఆజాద్ చంద్రవంశీ పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ జేడీయూ నుంచి బయటకు వచ్చి సొంతంగా హిందూస్తానీ అవామ్ మోర్చ పార్టీని స్థాపించారు. జెహానాబాద్ నుంచి ఆర్‌ఎల్‌ఎస్‌పీ టికెట్‌పై గెలిచిన అరుణ్‌కుమార్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై బహిష్కరించగా సొంత పార్టీ పెట్టారు. ఆయనా పోటీలో తిరిగి పోటీ చేస్తున్నారు. జేడీయూ నుంచి ఛండేశ్వర్ ప్రసాద్ యాదువంశీ, ఆర్‌జేడీ రెబల్ అంగేశ్ కుమార్ బరిలో ఉన్నారు.