జాతీయ వార్తలు

పాటలీపుత్రలో ఆసక్తికర పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మే 18: బీహార్‌లోని పాటలీపుత్ర సీటు లోక్‌సభ సీటులో పోటీ ఆసక్తికరంగా మారింది. భారత దేశ చరిత్రలో మగధ సామ్రాజ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి పాటలీపుత్ర లోక్‌సభ సీటులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు, ఆయన మాజీ విధేయుడు మధ్య హోరాహోరిగా ఎన్నికల సంగ్రామం జరుగుతున్నది. బీహార్‌లో లాలూ ప్రసాద్‌యాదవ్ మూడు దశాబ్ధాలుగా తనదైన శైలిలో రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. పాటలీపుత్ర భూభాగాన్ని రాజకీయంగా స్వాధీనం చేసుకున్నారు.
అయితే 2018లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సియాచిన్ ప్రాంతాన్ని రాజకీయంగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ఆర్జేడీ ప్రయత్నిస్తూనే ఉంది. గతంలో ఇక్కడి ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో 26 మంది బరిలో నిలువగా, నాలుగు సెగ్మెంట్లను కాంగ్రెస్-ఆర్జేడీ కలిసి పోటీ చేసి కైవసం చేసుకున్నాయి. ఆ తర్వాత మరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇంత కాలం జనతాదళ్(యు) ఆర్జేడీతో కలిసి ఉన్నా, ఐదేళ్ళ క్రితం జేడీ(యు) రూటు మార్చి బీజేపీతో జత కట్టింది. దీంతో రాజకీయంగా పరిస్థితులు మారాయి. జేడీ(యు) మద్దతుతో బీజేపీ లబ్ది పొందింది. ప్రస్తుత బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి రామ్‌కృపాల్ యాదవ్‌కు లాలూ కుమార్తె మిసాకు మధ్య పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో కృపాల్ విజయం సాధించారు. లాలూ కుమార్తెకు సీపీఎం, లిబరేషన్ మద్దతు పలికింది. 2014లో మిసా 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పుడు తమ యాదవ కులం నుంచి భారీగా ఓట్లు పడతాయని, తండ్రిని అకారణంగా దాణా కుంభకోణంలో ఇరికించారని, ఆరోగ్యం బాగా లేకపోయినా బెయిల్ లభించలేదని ఆమె చెప్పి సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఇలాఉండగా 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేసి 25 వేల ఓట్లలోపు తేడాతో ఓడిపోయారు. తన మాజీ అనుచరుడైన రంజన్ యాదవ్‌ను జేడీ(యు) బరిలోకి దించింది.