జాతీయ వార్తలు

జార్ఖండ్‌లోని మూడు నియోజకవర్గాల్లో నేడు పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మే 18: జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి శిబు సోరెన్ సహా 42 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యం ఆదివారం నిర్ణయింపబడుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడవ, తుది దశ పోలింగ్ ఆదివారం జరుగనుంది. జార్ఖండ్‌లోని మూడు నియోజకవర్గాలు- డుంకా, రాజ్‌మహల్, గొడ్డా నియోజకవర్గాలలో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, ఎనిమిదిసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ సోరెన్.. డుంకా నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగారు. ఆయన బీజేపీ అభ్యర్థి సునిల్ సోరెన్‌తో తలపడుతున్నారు. జేఎంఎం చీఫ్ 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో సునిల్ సోరెన్‌ను ఓడించారు. 22,00,119 మంది మహిళలు, 21మంది థర్డ్ జెండర్లు సహా మొత్తం 45,64,681 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. డుంకా నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు, రాజ్‌మహల్‌లో 14 మంది అభ్యర్థులు, గొడ్డాలో 13 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జేఎంఎం, కాంగ్రెస్, మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండి నేతృత్వంలోని జేవీఎం కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని 14 నియోజకవర్గాలలో ఈ కూటమి అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులతో పోటీకి దిగారు. రాజ్‌మహల్ నియోజకవర్గంలో జేఎంఎం సిట్టింగ్ ఎంపీ విజయ్ కుమార్ హన్స్‌డా బీజేపీ అభ్యర్థి హేమ్‌లాల్ ముర్ము నుంచి గట్టి సవాలును ఎదుర్కొంటున్నారు. హన్స్‌డా 2014 ఎన్నికల్లో ముర్మును ఓడించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముమ్ము 2004 ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థిగా రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి, 2014లో బీజేపీలో చేరారు. గొడ్డా నియోజకవర్గంలో సిట్టింగ్ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే జేవీఎం ఎమ్మెల్యే ప్రదీప్ యాదవ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.