జాతీయ వార్తలు

ఎగ్జాట్‌పోల్స్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 20: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీకే స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి స్పందించారు. మోదీ గాలి వీస్తోందని చెప్పుకోడానికి ఓ పథకం ప్రకారం ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేయించారని సోమవారం ఇక్కడ ధ్వజమెత్తారు. ఫలితాలు ఎలా ఉంటాయో తెలియకుండానే ప్రాంతీయ పార్టీలను గుప్పెట్లో పెట్టుకునేందుకు బీజేపీ ముందే ప్రయత్నాలు సాగిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ‘దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశాయి. మోదీ ప్రభుత్వంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు ఆస్కారం ఉందని సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఎప్పడి నుంచో వస్తున్న బ్యాలెట్ పేపర్ల విధానం ప్రవేశపెట్టాలని అందరం కోరాం. ఈవీఎంలపై మాకు విశ్వాసం లేదని చెప్పాం’అని కుమారస్వామి వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈవీఎంలకు స్వస్తిచెప్పి సంప్రదాయంగా వస్తున్న బ్యాలెట్ పేపర్ల విధానానే్న అమలుచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఆఖరి దశ పోలింగ్ తరువాత విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌పై తమకు ఎన్నో అనుమానాలున్నాయని, అధికార పార్టీ తన ప్రయోజల కోసం ఈవీఎంలను దుర్వినియోగం చేసి ఉంటుందని సీఎం ట్వీట్ చేశారు. దేశంలో ఇంకా మోదీ గాలి వీస్తోందని నమ్మించేందుకు ఎగ్జిట్‌పోల్స్ సర్వేలను పథకం ప్రకారం విడుదల చేయించారని అధికార బీజేపీపై ధ్వజమెత్తారు. వాతావరణం అంతా తమకే అనుకూలంగా ఉందనేలా ప్రజల్లో భ్రమలు కల్పించేందుకు సర్వేలను చేయించుకుని బయటకు వదిలారని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ అవి ఎగ్జిట్‌పోల్సే తప్ప ఎగ్జాట్‌పోల్స్ కాదు’అని కర్నాటక సీఎం ఎద్దేవా చేశారు. ఆఖరి విడత పోలింగ్ పూర్తయి తరువాత ఆదివారం సాయంత్రం ఎగ్జిట్‌పోల్ సర్వేలన్నీ బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏనే తిరిగి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఎన్‌డీఏ కూటమికి 300 సీట్లకు పైగా వస్తాయని తేల్చాయి. కర్నాటకలో బీజేపీ సత్తా చాటుతుందని 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో 21 సీట్లు కమలనాథుల ఖాతాలో పడతాయని సర్వేలు పేర్కొన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 17 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్, జేడీఎస్‌లు 9, రెండు సీట్లు గెలుచుకున్నాయి. కాగా నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బళ్లారి సీటును బీజేపీ కోల్పోయింది. ఇలా ఉండగా ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు చేసినా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.