జాతీయ వార్తలు

ఓట్ల లెక్కింపులో పారదర్శకత పాటించాలి: కనకమేడల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ఓట్ల లెక్కింపులో పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఎన్నికల జరిగిన రోజు రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన 17 సి ఫారంలోని సమాచారాన్ని సరిపోల్చుకొని లెక్కింపు ప్రారంభించాలని కోరినట్టు చెప్పారు. వివిధ పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి పత్రాలను తీసుకొని రావొద్దని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు చెప్పడం సరికాదని వెల్లడించారు. పోలింగ్ జరిగిన నాటి వివరాలతో సరిపోల్చుకునే అవకాశం పోలింగ్ ఏజెంట్లకు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ఈవీఎంలతో జత చేసిన వీవీ ప్యాట్ల లెక్కింపుతో ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున భోజన సదుపాయాలు కల్పించాలని కూడా కోరినట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నందున పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.