జాతీయ వార్తలు

రేపే నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రక్షణ రంగానికి చెందిన ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం ఉదయం 5:30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈమేరకు సోమవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన జరిగిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశంలో (ఎంఆర్‌ఆర్) శాస్తవ్రేత్తలు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఎస్ పాండ్యన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు వారు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగాత్మక ప్రయోగంలో భాగంగా సోమవారం శాస్తవ్రేత్తలు ప్రీ కౌంట్‌డౌన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. కౌంట్‌డౌన్ మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రారంభించనున్నారు. కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగినంతరం పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 5:30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ నేపధ్యంలో ఇస్రో డాక్టర్ కె శివన్ మంగళవారం షార్‌కు రానున్నారు. ముందుగా ఆయన చెంగాళమ్మ ఆలయంలో పూజలు చేసుకొని షార్‌కు వెళ్తారు. అక్కడ శాస్తవ్రేత్తలతో ప్రయోగ వేదిక వద్దకు చేరుకొని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించి మరోసారి శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగ వివరాలడిగి తెలుసుకోనున్నారు. షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించే ఈ రాకెట్ ద్వారా 615 కిలోల బరువు గల రీశాట్-2బి ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. భారతదేశ రక్షణ రంగానికి నూతన శక్తికోసం ఇస్రో శాస్తవ్రేత్తలు ఈ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ రంగంతో పాటు వ్యవసాయ, అటవీ రంగాలకు కూడా సేవలు అందించనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇది 4వ ఉపగ్రహ ప్రయోగం. మొదట ఉదయం 5:27 గంటలకు రాకెట్ ప్రయోగించుకోవాలన్న అంతరిక్షంలో పలు వ్యర్థ శకలాలు అడ్డుపడడంతో ప్రయోగాన్ని మూడు నిమిషాలు పెంచినట్లు శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 48వ ప్రయోగం కాగా ఫస్ట్ లాంచ్‌ఫ్యాడ్ నుంచి 36వ రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. ఇప్పటివరకు షార్ నుంచి 71 రాకెట్ ప్రయోగాలు జరిగాయి. ఇది 72 ప్రయోగం కాగా ఈ ఏడాది మూడో ప్రయోగం కావడం విశేషం.