జాతీయ వార్తలు

ప్రజ్ఞ నిశ్శబ్దం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మే 20: మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించి పార్టీ అధిష్టానం నుంచి గట్టి హెచ్చరికలను ఎదుర్కొన్న భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇపుడు నిశ్శబ్దం పాటించారు. గాంధీపై చేసిన వ్యాఖ్యలకు అప్పట్లోనే క్షమాపణ కోరిన ఆమె ఇపుడు మళ్లీ తన వ్యాఖ్యలు దేశభక్తులను కించపరిచినట్లయితే క్షమించాలని సోమవారంనాడు మరోసారి మీడియా పరంగా క్షమాపణలు కోరారు. అంతేకాకుండా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రాయశ్చిత్తంగా మరో 63 గంటల వరకు నిశ్శబ్దాన్ని పాటించనున్నట్టు ప్రకటించారు. 2008 మాలెగాం బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రజ్ఞా ఠాకూర్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తకాదు. 26/11 ముంబయి ఉగ్రదాడిలో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే హతం కావడంపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తనను జైలులో బంధించి, తీవ్రంగా హింసించినందువల్లే హేమంత్ కర్కరే ఉగ్రవాదుల చేతుల్లో దారుణంగా హతమయ్యారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం తీవ్రంగా మండిపడింది. అదేవిధంగా తాజాగా మహాత్మా గాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా అభివర్ణిస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను క్షమించేది లేదు అంటూ ఘాటుగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా, సోమవారం ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ సోమవారం ఉదయం నుంచి 63 గంటల పాటు నిశ్శబ్దం పాటించనున్నట్టు తెలిపారు. పూజ్య బాపూజీపై చేసిన వ్యాఖ్యలపై ఒక ట్వీట్ ద్వారా క్షమాపణలు కోరారు.