జాతీయ వార్తలు

కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేస్తే కోర్టుకెళ్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31: రాష్టప్రతి పాలనలో ఉన్న ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 1 తర్వాత జరిపే వ్యయానికి అధికారాలు ఇచ్చేందుకు కేంద్రం గనుక ఆర్డినెన్స్ జారీ చేసిన పక్షణలో కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ గురువారం ఇక్కడ చెప్పారు. అలాంటి ఆర్డినెన్స్‌ను జారీ చేయడం అనేది గతంలో ఎన్నడూ లేదని, అంతేకాక అది రాజ్యాంగానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కూడా అయిన సిబల్ ఇక్కడ విలేఖరులతో అన్నారు.
కేంద్రం పార్లమెంటు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఆర్డినెన్స్‌లను దుర్వినియోగం చేస్తోందని ఆయన అన్నారు. సీనియర్ న్యాయవాది కూడా అయిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై సిబల్ విమర్శలు కురిపిస్తూ, ‘జైట్లీని నేను అభినందించి తీరాలి. ఎందుకంటే ఇది ఆయన విగషయంలో మొట్టమొదటిది. ఒక అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందిందా లేదా అనేది కేంద్రం నిర్ణయిస్తోంది’ అని అన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆమోదించడం జరిగిందని, స్పీకర్ సైతం బడ్జెట్ ఆమోదం పొందినట్లు ప్రకటించారని, దానికి వ్యతిరేకంగా ఏ కోర్టులోను ఎలాంటి పిటిషన్ దాఖలు కావడం కానీ,ఎవరైనా దాన్ని సవాలు చేయడం కానీ జరగలేదని సిబల్ చెప్పారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందలేదని ఏదో విధంగా చూపించడంలో భాగంగా కేంద్రం, బిజెపి ఈ రాజకీయ క్రీడ ఆడుతున్నాయని ఆయన అన్నారు. ‘వాళ్లు రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారు. కానీ రాజ్యాంగాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు’ అని ఆయన అన్నారు.
ఆర్డినెన్సు జారీ చేయడం కోసం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రోరోగ్ చేయడం కూడా ఈ క్రీడలో ఒక భాగమని ఆయన చెప్పారు. ‘ఈ విషయంపై పార్లమెంటులో బిల్లు తెచ్చినట్లయితే ఓడిపోతామని వాళ్లకు భయం’ అని సిబల్ చెప్పారు. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ‘ఒక రాష్ట్రంలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండా రాజ్యాంగ సంక్షోభం తలెత్తే పరిస్థితిని సృష్టించారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందక పోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1 తర్వాత వారి జీతాలు లభించవు. అంతేకాదు, రాష్ట్ర అభివృద్ధి సైతం నిలిచిపోతుంది’ అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు.