జాతీయ వార్తలు

‘స్కార్పీన్’ లీకేజీని తీవ్రంగా పరిగణిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: స్కార్పీన్ జలాంతర్గామికి సంబంధించిన రహస్య సమాచారం లీక్ కావడం పెద్దగా ఆందోళనకరమైన విషయమేమీ కాదని, అయినప్పటికీ దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని నావికాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా సోమవారం స్పష్టం చేశారు. స్కార్పీన్ జలాంతర్గామి శక్తిసామర్ధ్యాలకు సంబంధించిన 22 వేల పేజీలకు పైగా సమాచారం బహిర్గతం కావడంపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి. ‘ఎటువంటి రహస్య సమాచారం బహిర్గతమైనా తీవ్రంగా పరిగణిస్తున్నాం. అలాగే స్కార్పీన్ జలాంతర్గామి డేటా లీక్ కావడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ అంశంపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా ఫ్రెంచ్ సంస్థ డిసిఎన్‌ఎస్‌కు విజ్ఞప్తి చేశాం’ అని ఆయన న్యూఢిల్లీలో విలేఖర్లతో అన్నారు. ఈ అంశంపై దర్యాప్తు జరిపేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ సమర్పించే నివేదికను ఆధారంగా చేసుకుని నష్టనివారణకు చేపట్టాల్సిన చర్యలేమిటో పరిశీలిస్తామని సునీల్ లాంబా చెప్పారు. అసలు బహిర్గతమైన సమాచారం ఏమిటో పరిశీలించి, నష్టనివారణకు చేపట్టాల్సిన చర్యలేమిటన్న దానిపై ఉన్నత స్థాయి కమిటీ కసరత్తు చేస్తోందని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 20వ తేదీలోగా ఈ కమిటీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు సమగ్ర నివేదిక సమర్పిస్తుందని భావిస్తున్నారు.