జాతీయ వార్తలు

ఎమ్మెల్యే అభ్యర్థి సహా 11 మంది కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, మే 21: ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో వెలువడనున్న తరుణంలో అరుణాచల్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన కుమారుడు, భద్రతా సిబ్బంది, అనుచరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యేతో సహా మొత్తం 11మంది అక్కడికక్కడే మరణించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తొలుత ఏడుగురే మరణించినట్లు సమాచారం వచ్చిందని, అయితే ఈ దుర్ఘటనలో మొత్తం 11మంది మరణించారని డీజీపీ ఎస్‌బీకే సింగ్ వెల్లడించారు. పశ్చిమ ఖోన్సా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే తిరాంగ్ అబో (41) మళ్లీ ఎన్నిక నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన తన కుటుంబ సభ్యులు, ముగ్గురు భద్రతా సిబ్బంది, అనుచరులతో అస్సాం నుంచి తన నియోజకవర్గానికి వెళుతుండగా దారికాచి కాల్పులు జరపడంతో 11మంది అక్కడికక్కడే మరణించారు. కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన మరో భద్రతా అధికారిని దిబ్రూఘర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బోగపాని గ్రామ సమీపంలో ఉ. 11.30కు జరిగిన ఈ ఘటనకు నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ (ఎన్‌ఎస్‌సీఎన్-ఐఎం) సభ్యుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పీఎంఓ సహా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్‌రాడ్ కె.సంగ్మా కోరారు. ఈ ఘటనతో ఎన్‌పీపీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని ఆయన ట్వీట్ చేశారు. హంతకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది వారిని వెంటాడి పట్టుకుంటామని, ఈ ఘటన మమ్మల్ని షాక్‌కు గురి చేసిందని హిమాచల్ ముఖ్యమంత్రి పేమా ఖండూ స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, దీనికి అధికార బీజేపీయే కారణమని అరుణాచల్ పీసీసీ ధ్వజమెత్తింది. ప్రజలు ఎన్నుకున్న నాయకులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ దొరుకుతుందని, కాల్పుల ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని రాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఘటనకు బీజేపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. కాగా 41 ఏళ్ల తిరాంగ్ అబో 2014లో పశ్చిమ ఖోన్సానుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అరుణాచల్ పీపుల్స్ పార్టీ (పీపీఏ) తరపున అబో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థిగా పోటీచేశారు. ఫలితాలు వచ్చేలోపే ఈ దుర్ఘటన జరగడం కలకలం రేపింది.

తిరాంగ్ అబో (ఫైల్‌ఫొటో)