జాతీయ వార్తలు

మళ్లీ మనదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: కేంద్రంలో రెండోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీతోపాటు మిత్రపక్షాల నాయకులకు మరోసారి భరోసా ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్‌డీఏ మంత్రులు, మిత్రపక్షాల నాయకులతో ధన్యవాదాల సమావేశం ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఐదేళ్లపాటు దేశానికి చేసిన సేవలకుగాను నరేంద్ర మోదీ మంత్రులు, మిత్రపక్షాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ భారీ మెజారిటీతో గెలుస్తోంది.. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మంత్రులు, మిత్రపక్షాల నాయకులతో చెప్పినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగనున్న నేపథ్యంలో అమిత్ షా, నరేంద్ర మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేయటం గమనార్హం. బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నరేంద్ర మోదీకి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పుష్పగుచ్చం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రాంలాల్ కూడా ప్రధాన మంత్రికి స్వాగతం పలికారు. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తదితర బీజేపీ మంత్రులు, లోక్ జనశక్తి పార్టీకి చెందిన కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్, అకాలీదళ్‌కు చెందిన మంత్రి హరసిమ్రత్ కౌర్ బాదల్, అప్నాదళ్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అనుప్రియా పాటిల్ తదితరులు హాజరయ్యారు. అనుప్రియా పాటిల్ ప్రధాన మంత్రికి శాలువ కప్పి పుష్చగుచ్చం అందజేశారు. ఇదిలాఉంటే అమిత్ షా మంగళవారం రాత్రి అశోకా హోటల్‌లో బీజేపీ, ఎన్‌డీఏ మిత్రపక్షాలకు విందు ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విందుకు హాజరయ్యారు.

చిత్రం...ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన ఎన్‌డీఏ మంత్రులు, మిత్రపక్షాల నాయకుల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సన్మానిస్తున్న బీజేపీ శ్రేణులు