జాతీయ వార్తలు

హిందీ రాష్ట్రాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎగ్జిట్‌పోల్ సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో హిందీ రాష్ట్రాలే ఎన్నికల ఫలితాల్లో కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన యూపీలో 2014 ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలు కైవసం చేసుకుంది. హిందీ రాష్ట్రాలైన యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో ఫలితాలే కీలకం కానున్నాయి. 2014 ఎన్నికల్లో ఈరాష్ట్రాల్లోని 185 స్థానాల్లో బీజేపీకి 165 వచ్చాయి. అంటే సుమారు 90 శాతం సీట్లు దక్కించుకున్నట్టయింది. ఈసారి దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ సర్వేలూ బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. బీజేపీయేతర రాష్ట్రాలైన బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో కమలనాథులకే పట్టం కడతారని సర్వేలు తేల్చాయి. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి గట్టిపోటీని ఎదుర్కొన్నప్పటికీ 33-65 మధ్య సీట్లు బీజేపీకి వస్తాయని వెల్లడించాయి. మరికొన్ని ఎగ్జిట్‌పోల్స్‌లో మాత్రం బీజేపీకి ఐదు రాష్ట్రాల్లో కలిపి 89 సీట్లు రావచ్చని అంచనా వేశాయి. సర్వేలు ఎలా ఉన్నప్పటికీ 144కి తక్కువ రాకుండా సీట్లు గెలుచుకుంటామన్న ధీమాతో అధికార పార్టీ ఉంది. కీలక రాష్టమ్రైన యూపీలో సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు అధికార పార్టీకు ముచ్చెమటలు పోయించాయి. నువ్వానేనా అన్నట్టు పోరు సాగింది. యూపీలో ఆశించిన సీట్లు రాకపోయినా మిగతా చోట్ల భర్తీ చేసుకోవచ్చన్న విశ్వాసం బీజేపీ నేతల్లో ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఎక్కువ సీట్లు సాధించి మెజారిటీ మార్క్ 272ను సునాయాసంగా దాటేస్తామని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. బీజేపీ సొంత బలంతోనే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని వార్తా ఛానళ్లు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మొదట్లో బీజేపీకి కష్టమేనని 2014 నాటి ఫలితాలు రాకపోవచ్చని పరిశీలకులు పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓటమిని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే ప్రచారంలోకి దిగిన బీజేపీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చేసుకుంది. మూడు రాష్ట్రాల్లో స్వీప్ చేస్తామని, మళ్లీ అధికారం తమదేనని బీజేపీ చీఫ్ అమిత్‌షా పదేపదే ప్రకటించారు.