జాతీయ వార్తలు

సౌకర్యాలు ఏవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, మే 22: లోకసభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు, ఏర్పాట్లు జరగలేదని కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ విమర్శించారు. అవసరమైన సౌకర్యాలు ఏవీ అంటూ ఆయన ఎన్నికల కమిషనర్ (ఈసీ), సీఆర్‌పిఎఫ్ అధికారులను నిలదీశారు. ఈ మేరకు ఓ లేఖ రాస్తూ బిహార్‌లో ఎన్నికల డ్యూటీలో పాల్గొని తిరిగివచ్చిన కేరళ పోలీసులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరైన సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈసీ, సీఆర్‌పిఎఫ్‌పైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. కేరళ పోలీసులు సమస్యలకు లోనుకాకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.