జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లో 292 కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మే 22: మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు 292 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గురువారం సాయంత్రానికే ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 1800 సీసీటీవీలు కెమెరాలు ఏర్పాటయ్యాయి. ఇంటర్నెట్, వైఫై సర్వీసులుండవని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వీఎల్ కాంతారావువెల్లడించారు. 292 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపుమొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. 51 జిల్లా ప్రధాన కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఫస్ట్ రౌండ్ ఫలితం 10 గంటలకే వెలువడే అవకాశం ఉంది. అత్యధికంగా ఇణటోర్‌లో 29 రౌండ్ల లెక్కింపుఉంటుందని కాంతారావు వెల్లడించారు. అత్యల్పంగా అంటే 14 రౌండ్లు కట్నిలో ఉంటుంది. బందోబస్తు కోసం 17 కంపెనీల కేంద్ర బలాగాలతోపాటు తొమ్మిది వేల మందిని నియమించారు. 29 నియోజకవర్గాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 29న (ఆరుసీట్లు), మే 6న (ఏడు సీట్లు), మే 12న (ఎనిమిది సీట్లు), మే 19న (ఎనిమిది సీట్లు) పోలింగ్ నిర్వహించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ 27 స్థానాలకు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం రెండు చోట్లే గెలిచింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడంతో ఈసారి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు దక్కుతాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో భోపాల్ లోక్‌సభ నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌పై కరుడుగట్టిన హిందుత్వవాది, మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పోటీ చేశారు. ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉంది. అలాగే గుణ,్ఛంద్వారా సీట్లు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మంగా మారాయి. కాంగ్రెస్ నేతలు జ్యోతిరాదిత్య, కమల్‌నాథ్ 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచారు. ఈసారి కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ పోటీలో ఉన్నారు. కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ సింగ్(జబల్‌పూర్), బీజేపీ నేత ప్రహ్లాద్ పటేల్(దామోహ్), కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్(మొరేనా), మాజీ కేంద్ర మంత్రులు కాంతీలాల్ భూరియా (రత్లాం- ఝాబు), అరుణ్ యాదవ్ (ఖాండ్వ), మాజీ ప్రతిపక్ష నేత అజయ్ సింగ్(సింధీ) నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.