జాతీయ వార్తలు

మారాజు ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: సుదీర్ఘంగా సాగిన పదిహేడవ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేలే రోజు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని, దేశాధినేతను నిర్ణయంచే సమయం, ఓటరు తీర్పును నిక్షిప్తం చేసుకున్న ఈవీఎంలు గుట్టు విప్పే క్షణం ఆసన్నమైంది. 38 రోజులపాటు ఏడు దశల్లో సాగిన సార్వత్రిక ఎన్నికల పోరులో పీఠాన్ని అధిరోహించే మారాజు ఎవరనేది నేటితో తేలిపోనుంది. విజయం మాదంటే మాదేనని చెప్పుకున్న పార్టీల భవితవ్యమే కాదు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఏది నిజమో మరో కొన్ని గంటల్లో తేటతెల్లం కానుంది. సార్వత్రిక ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 11నుంచి మే 19వరకు ఏడు దశలో ల ఎన్నికలు జరిగాయ. 532 లోక్‌సభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో సుమారు 90కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్కంఠ పోరుతో, హామీల వరదతో, వ్యక్తిగత దూషణలతో హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరు ఆద్యంతం సింహాసనం కోసం జరిగే యుద్ధానే్న తలపించింది. ఈ పోరులో విజేతలెవరో, పరాజితులెవరో ఈవీఎంలు తేల్చేయనున్నాయి.
బీజేపీ అధినాయకుడు నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టిస్తారా లేక ఇరవై ఐదు ప్రతిపక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? 300 పైచిలుకు సీట్లతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాటలు నిజమవుతాయా లేక ప్రతిపక్షాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మాటలు నిజమవుతాయా? లేదా మొత్తం మీడియా చెబుతున్నట్లు ఎన్‌డీఏకు మూడు వందల పైగా సీట్లు లభించి నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపడతారా? అనేది గురువారం పదిహేడవ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో తేలిపోతుంది. దేశంలోని దాదాపు తొంభై కోట్ల మంది ఓటర్లు పటిష్టమైన నాయకత్వాన్ని అందజేస్తున్న నరేంద్ర మోదీకి పట్టం కడతారా? దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా ఎన్‌డీఏకు మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ తలకిందులై యూపీఏ, ఇతరులకు అధిక సీట్లు లభిస్తే ప్రతిపక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరానికి మించి ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబును విజయం వరించినట్లు అవుతుంది. నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వచ్చే పక్షంలో చంద్రబాబుకు తిప్పలు తప్పవు.
ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు దాదాపు 38 రోజులపాటు ఏడు దశల్లో జరిగిన పదిహేడవ లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభల ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. 532 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొదట ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్లు, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తరువాత ఈవీఎంల ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఆ తరువాతే ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎం ఓట్లతో పోల్చి ధ్రువీకరిస్తారు. ప్రతిపక్షం డిమాండ్ చేసినట్లు మొదటి వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంల ఓట్లతో పోల్చి ధ్రువీకరించించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత రెండు మూడు గంటల్లో ట్రెండ్స్ రావటం ప్రారంభం అవుతుంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎం ఓట్లతో పోల్చి ధ్రువీకరించుకోవలసి ఉన్నందున ఎన్నికల ఫలితాలు సాయంత్రం నుండి రావటం ప్రారంభం అవుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఐదెంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
మీడియా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు జరిపిన లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ రెండోసారి అధికారంలోకి రానున్నట్లు అంచనా వేయటం తెలిసిందే. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సంస్థ ప్రకటించిన సర్వే ప్రకారం ఎన్‌డీఏకు 339-365 మధ్య సీట్లు లభిస్తాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు 77 నుండి 108 సీట్లు లభిస్తాయి. ఇతరులకు 69 నుండి 95 వరకు సీట్లు లభిస్తాయని అంచనా వేయటం తెలిసిందే. ఇతర ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్‌డీఏకు 285 నుండి 325 వరకు వస్తాయని అంచనా వేశాయి. ఇదేవిధంగా యూపీఏకు 90 నుండి 130 సీట్లు, ఇతరులకు 120 నుండి 140 వరకు సీట్లు రావచ్చునని అంచనా వేశాయి. అయితే ఈ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయనేది గురువారం తేలిపోతుంది. గతంలో కొన్ని మీడియా సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు నిజం కాగా మరికొన్ని సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా దారితప్పటం తెలిసిందే.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించినట్లు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం మరోసారి అధికారంలోకి వస్తుందా లేక అన్ని మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడా? అనేది తేటతెల్లం అవుతుంది. ఎగ్జిట్ పోల్స్ నిజమై జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే లగడపాటి రాజగోపాల్ సర్వే వరుసగా నాలుగోసారి తప్పినట్లవుతుంది.

చిత్రాలు.. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ